మహేష్ బాబు కొత్త చిత్రం 'వరుడు' (మారచ్చు) లో హీరోయిన్ ఖరారైందని తెలుస్తోంది. ఇందులో "ఓం శాంతి ఓం" ఫేమ్ అందాల భామ దీపికా పడుకునే నటించనుందనే వార్తలు ఫిల్మ్ నగర్ లో వినపడుతున్నాయి. అలాగే ఈ చిత్రం జూలై 16వ తేదీ నుంచి సెట్‌పైకి వస్తుందని కంటిన్యూగా రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారని తెలుస్తోంది. అయితే మరో ప్రక్క త్రివిక్రమ్ స్క్రిప్టు కు ఇంకా మెరుగులు దిద్దుతున్నాడని అంటున్నారు. గతంలో వార్తలు వచ్చినట్లుగా 'వెల్ కమ్' హిందీ సినిమా నుండి ప్రేరణ పొందిన కథ ఉండకపోవచ్చునని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాని కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ 'పులి' చిత్ర నిర్మాత కూడా ఈయనే. ఆ సినిమా హీరోయిన్ సమస్యను ఎదుర్కోవటం విశేషం.