రణ్‌వీర్ సింగ్‌కు ఎన్సీబీ షాక్.. ఆ రెండు పార్టీలే టార్గెట్.. పీకల్లోతు కష్టాల్లో దీపిక పదుకోన్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో భాగంగా బయటపడ్డ బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాల కేసులో దీపికా పదుకోన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఎన్సీబీ సిట్ గెస్ట్‌హౌజ్‌కు దీపిక చేరుకొన్నారు. ప్రస్తుతం ఆమెను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీపికకు తోడుగా తాను విచారణకు హాజరవుతానని చేసుకొన్న రణ్‌వీర్ సింగ్ అభ్యర్థనను ఎన్సీబీ తోసిపుచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Deepika Padukone at NCB office For Interrogation వేర్వేరు ప్రదేశాల్లో టాప్ హీరోయిన్ల విచారణ !
దీపిక పదుకోన్‌కు అండగా రణ్‌వీర్ సింగ్

దీపిక పదుకోన్‌కు అండగా రణ్‌వీర్ సింగ్

డ్రగ్స్ కేసులో భాగంగా దీపిక పదుకోన్‌కు సమన్లు జారీ చేయడంతో రణ్‌వీర్ సింగ్ విదేశాల్లో నుంచి నేరుగా గోవాకు చేరుకొని భార్యకు అండగగా నిలిచారు. అక్కడి నుంచే 12 మందికిపైగా లాయర్ల బృందంతో కేసు గురించి చర్చించారు. ఆ క్రమంలోనే దీపికతోపాటు తనను విచారణకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.

 రణ్‌వీర్ సింగ్ అభ్యర్థనను తోసిపుచ్చిన అధికారులు

రణ్‌వీర్ సింగ్ అభ్యర్థనను తోసిపుచ్చిన అధికారులు

అయితే రణ్‌వీర్ సింగ్ చేసుకొన్న అభ్యర్థనను ఎన్సీబీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చినట్టు సమాచారం. తన భార్యకు మానసిక సమస్యలు ఉన్నాయని, ఆమె ఆరోగ్యం అంతా సహకరించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో తాను ఆమె వెంట ఉంటే బాగుంటుందని రణ్‌వీర్ సింగ్ తన అభ్యర్థన లేఖలో పేర్కొన్నారు. అయితే అందుకు ఎన్సీబీ అంగీకరించకపోవడంతో దీపిక ఒక్కరే విచారణకు హాజరైనట్టు సమాచారం.

దీపికకు పలు ప్రశ్నలతో కూడిన జాబితా

దీపికకు పలు ప్రశ్నలతో కూడిన జాబితా

తాజా సమాచారం ప్రకారం దీపికను పలు అంశాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు కురిపిస్తున్నట్టు సమాచారం. దీపిక కోసం పలు ప్రశ్నలతో కూడిన జాబితాను తయారు చేసి ఆమెకు అందించినట్టు తెలుస్తున్నది. ఆ జాబితాలోనే ఆమె రాతపూర్వకమైన సమాధానాలు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. 2019లో కరణ్ పార్టీ, అలాగే 2017లోని కోకో రెస్టారెంట్ పార్టీ గురించి అనేక ప్రశ్నలు సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ధర్మ ప్రొడక్షన్ సిబ్బంది, కరిష్మా ప్రకాశ్ చెప్పిన విషయాలను దీపిక తోసిపుచ్చినట్టు బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.

శ్రద్దా, సారా, దీపికను వేర్వేరు ప్రదేశాల్లో

శ్రద్దా, సారా, దీపికను వేర్వేరు ప్రదేశాల్లో

ఇదిలా ఉండగా, శనివారం ముగ్గురు టాప్ హీరోయిన్లు సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, దీపిక పదుకోన్‌ను విచారిస్తుండటంతో బాలీవుడ్‌, మీడియాలో వాతావరణం వేడెక్కింది. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం కాకుండా వీరిని వేర్వేరు ప్రదేశాల్లో విచారించేందుకు ఏర్పాటు చేసింది. శ్రద్దా కపూర్‌ ఎన్సీబీ జోనల్ ఆఫీస్‌లో జరిగే విచారణకు 11 నుంచి 12 గంటల ప్రాంతంలో హాజరుకానున్నారు.

రకుల్ ప్రీత్ విచారణ పూర్తి

రకుల్ ప్రీత్ విచారణ పూర్తి

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా శుక్రవారం దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను, హీరోయిన్ రకుల్ ప్రీత్‌ను సుదీర్ఘంగా విచారించారు. కరిష్మా గతంలో ఎనిమిదేళ్లు మేనేజర్‌గా పనిచేయగా, ధర్మ ప్రొడక్షన్స్‌లో తొమ్మిదేళ్లు మేనేజర్‌గా పనిచేశారు. ఇక రియా చక్రవర్తితో డ్రగ్స్ సంబంధాలు, చాటింగ్ అంశాలపై రకుల్ ప్రీత్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X