దీపిక పడుకొనెకు ‘స్మితా పాటిల్ స్మారక’ అవార్డు
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనెకు స్మితా పాటిల్ స్మారక అవార్డుకు ఎంపికయింది. చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సినీ కళాకారులకు ఈ అవార్డును అందజేస్తూ ఉంటారు. ప్రియదర్శిని అకాడమి వారు ఈ అవార్డును అందజేస్తున్నారు.
స్మితా పాటిల్ 28వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 18న ఈ అవార్డును దీపికకు బహూకరించనున్నారు. ఈ విషయాన్ని అకాడమి చైర్మన్ నానిక్ రుపాని మంగళవారం వెల్లడించారు. గతంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.
అయితే దీపిక పడుకొనెకు ఈ అవార్డు దక్కడంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీపిక చెప్పుకోదగ్గ గొప్ప చిత్రాలు, నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు ఏమీ చేయక పోయినా ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే స్మితా పాటిల్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 18న ప్రియదర్శిని అకాడమీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన కుమార మంగళం బిర్లా, సమీర్ బ్రహ్మచారి, నీరజ్ దేవా, ఆదిత్యపురి, మిలింద్ దియోరాలను సన్మానించనున్నారు.


Click it and Unblock the Notifications











