»   » మై చాయిస్ వీడియోపై మౌనం వీడిన దీపిక పదుకోన్

మై చాయిస్ వీడియోపై మౌనం వీడిన దీపిక పదుకోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మహిళా సాధికారత'పై వోగ్ ఎంపవర్ కాంపెయిన్‌లో భాగంగా ఆ మధ్య దీపిక పదుకోన్ ప్రధాన పాత్రలో, హోమి అదజనియా దర్శకత్వంలో విడుదల చేసిన ‘మై చాయిస్' వీడియో వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ప్రస్తావించిన కొన్ని అంశాలపై మహిళలు సైతం అభ్యంతరం వ్యక్తం చేసారు.

నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనేది పూర్తిగా నా ఇష్టం. నా వివాహం నాకు నచ్చినట్లు జరుగడమే కాదు..నా జీవితాన్ని పురుషుడితో పంచుకోవాలా? లేక స్త్రీతో పంచుకోవాలనేది కూడా పూర్తిగా నా ఇష్టం..అంటూ ఈ వీడియోలో చెప్పడాన్ని కొందరు బహిరంగంగానే విమర్శించారు.

Deepika Padukone breaks her silence on ‘My Choice’ video

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా....అప్పట్లో ఆ వీడియోపై స్పందిస్తూ ‘మహిళా సాధికారత అంటే....వివాహేతర సంబంధం, నచ్చిన విధంగా బట్టలేసుకోవడం, నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనడం లాంటివి కాదు. మహిళా సాధికారత అంటే.. ఉద్యోగం, మానిసిక స్థైర్యం' అని స్పష్టం చేసింది.

మౌనం వీడిన దీపిక...
ఇప్పటి వరకు మై చాయిస్ వీడియోపై వచ్చిన ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువ. ఈ విషయమై ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దీపిక ఎట్టకేలకు స్పందించింది. మహిళ సాధికారత అంశంపై మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని అభినందించని వారికి థాంక్స్. విమర్శించిన వారి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తున్నాం. మై చాయిస్ వీడియో ద్వారా మే చెప్పదలుచుకున్న విషయం అందరికీ సరిగా రీచ్ కాలేదు. చాలా మందికి మా ఉద్దేశ్యం ఏమిటో అర్థం కాలేదు. ఇలాగే చేయమని ఎవరికీ చెప్పడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు నిర్ణయం తీసుకోవాలనే విషయం మాత్రమే చెప్పామని దీపిక పదుకోన్ వివరణ ఇచ్చారు.

English summary
Check out: Deepika Padukone breaks her silence on ‘My Choice’ video.
Please Wait while comments are loading...