»   » షాక్: మాజీ లవర్‌ను అన్నయ్యా అనేసింది (ఫోటోస్)

షాక్: మాజీ లవర్‌ను అన్నయ్యా అనేసింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ మధ్య గతంలో లవ్ ఎఫైర్ నడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరి వ్యవహారం దాదాపు పెళ్లి వరకు వెళ్లింది, కానీ జరుగలేదు. తర్వాత ఈ ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఈ ఇద్దరు మాజీ లవర్స్ కలిసి తాజాగా ‘తమాషా' అనే చిత్రంలో నటిస్తున్నారు.

మంగళవారం జరిగిన ‘తమాషా' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దీపిక షాకింగ్ కామెంట్స్ చేసింది. తన మాజీ లవర్ రణబీర్ ను ఏకంగా అన్నయ్యా అనేసింది. ఎంత మాజీ లవర్ అయితే మాత్రం ఇలా అన్నయ్యా అనేయడం ఏమిటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే దీపికపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో 90 రోజుల పాటు సందేశాలు డిలీట్ చేయకూడదు అనే ప్రతి పాదన తెస్తున్న నేపథ్యంలో....దీనిపై రణబీర్ కపూర్ స్పందిస్తూ ప్రేమికులు ఇకపై వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపుకోవద్దు బుక్ అయిపోతారు అంటూ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న దీపిక శభాష్ బ్రొ... అంటూ రణబీర్‌కు సపోర్ట్ ఇచ్చింది. ఉన్నట్టుండి రణబీర్ ను దీపిక బ్రొ... (బ్రదర్) అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

తమాషా చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియావాలా నిర్మాత. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

రణబీర్-దీపిక-ఇంతియాజ్

రణబీర్-దీపిక-ఇంతియాజ్


ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రణబీర్, దీపిక, ఇంతియా అలీ కలిసి పోటోలకు ఫోజులు.

రణబీర్ దీపిక

రణబీర్ దీపిక


ట్రైల్ లాంచ్ సందర్భంగా దీపిక, రణబీర్ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మాజీ లవర్స్

మాజీ లవర్స్


మాజీ లవర్స్ అయిన దీపిక, రణబీర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ట్రైలర్ లాంచ్

ట్రైలర్ లాంచ్


తమాషా మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం జరిగింది.

క్యూట్ పిక్

క్యూట్ పిక్


తన లిటిల్ ఫ్యాన్ తో కలిసి దీపిక పదుకోన్...

దర్శకుడితో..

దర్శకుడితో..


దర్శకుడు ఇంతియాజ్ అలీతో కలిసి దీపిక, రణబీర్.

దీపిక, ఇంతియాజ్

దీపిక, ఇంతియాజ్


ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సందర్భంగా దర్శకుడు ఇంతియాజ్ తో కలిసి దీపిక

దీపిక, రణబీర్ కలిసి

దీపిక, రణబీర్ కలిసి


ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి రణబీర్, దీపిక కలిసే హాజరయ్యారు.

అభిమానులతో..

అభిమానులతో..


అభిమానులకు ఆటోగ్రాఫ్స్ ఇస్తున్న దీపిక పదుకోన్.

కెమెరాకు..

కెమెరాకు..


కెమెరాకు ఫోజులు ఇస్తూ దీపిక ఇలా...

English summary
Surprised? So are we! But Deepika Padukone actually called ex boyfriend Ranbir Kapoor 'bro' at the Tamasha trailer launch.
Please Wait while comments are loading...