కన్యత్వం(వర్జిన్) గొడవ, దీపిక పదుకోన్ సీరియస్

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ దీపిక పదుకోన్ కన్యత్వం(వర్జిన్)పై పెద్ద దుమారమే రేగింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ మూవీ ‘ఫైండింగ్ ఫన్నీ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఓ సన్నివేశంలో ‘నేను ఇంకా కన్యనే(స్టిల్ వర్జిన్)' అనే డైలాగ్ చెప్పింది. అయితే ఈ డైలాగ్ వల్గర్‌గా ఉందంటూ సెన్సార్ బోర్డు తొలగించింది.

అయితే సెన్సార్ బోర్డు తీరుపై దీపిక మండి పడింది. ఆ డైలాగులో అసభ్యత ఏముందో అర్థం కావడం లేదు, సెన్సార్ బోర్డు అనవసర రాద్దాంతం చేస్తోంది అంటూ మీడియాతో వ్యాఖ్యానించింది. సెన్సార్ బోర్డు ఇష్టాను సారంగా ప్రవర్తిస్తోందని, బోర్డు నిబంధనలు సరిగా లేవని, ఇతర సినిమాల్లో అలాంటి డైలాగులు ఉన్నపుడు తమ సినిమాలో ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. తమ సినిమాలో కథానుగుణంగానే ఆ డైలాగ్ ఉందని, ఆ డైలాగ్ లేకుంటే సినిమా కాన్సెప్టు దెబ్బతింటుందని తెలిపారు.

 Deepika Padukone: Censoring 'Virgin' From Film Is Invalid

బాలీవుడ్ మూవీ 'ఫైండింగ్ ఫన్నీ' మూవీలో దీపిక పదుకోన్, అర్జున్ కపూర్ మధ్య జరిగే సంభాషణలో.... దీపిక పదుకోన్ నేను 'వర్జిన్'(కన్యత్వం కలిగి ఉండటం) అని చెప్పిన డైలాగ్ విషయంలో వివాదం ఏర్పడింది. దీపిక చెప్పిన 'నేను వర్జిన్' అనే డైలాగ్ వల్గర్‌గా ఉందని, ఆ డైలాగ్ కత్తిరించేయాలంటూ ఆదేశించింది సెన్సార్ బోర్డు.

సెన్సార్ బోర్డు ఆ డైలాగ్‌పై అభ్యంతరం తెలపడాన్ని దర్శకుడు హోమి అదజనియా తప్పు పడుతున్నారు. వర్జిన్(కన్యత్వం) అనే పదంలో అసభ్యత ఏముందో నాకు అర్థం కావడం లేదు. గతంలో చాలా సినిమాల్లో ఈ డైలాగ్ వాడారు అని హోమి అదజనియా వాదిస్తున్నారు.

గతంలో వచ్చిన 'దిల్ సె' చిత్రంలో, ఇటీవల వచ్చిన '2 స్టేట్స్' చిత్రంలో వర్జిన్ అనే డైలాగ్ వాడారని....వారికి లేని అభ్యంతరం తమ సినిమా విషయంలో ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని హోమి అదజనియా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకుడి వాదనతో సెన్సార్ బోర్డు ఏకీభవించడం లేదు. 'ఫైండింగ్ ఫన్నీ' చిత్రంలో దీపిక పదుకోన్ విధవ పాత్రలో కనిపించనుంది. రణవీర్ సింగ్ ఆమె భర్తగా అతిథి పాత్రలో నటించాడు. అర్జున్ కపూర్ హీరోగా నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X