twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సబ్బు యాడ్ కోసం ఆమెకి ఆరు కోట్లు

    By Srikanya
    |

    ముంబై: యాడ్ లో కొద్ది క్షణాలు కనిపించేందుకు హీరోయిన్స్ తీసుకునే మొత్తాలు పెద్ద హీరోలతో చేసే సినిమా రెమ్యునేషన్స్ ని తలపిస్తున్నాయి. తాజాగా 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో హిట్ కొట్టిన దీపికా పదుకొణే యాడ్స్ రెమ్యునేషన్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా సూపర్ హిట్ అవటంతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో దీపిక ఉంది.

    రీసెంట్ గా దీపిక కు ఓ సబ్బు ప్రకటన కోసం ఆమెకు అక్షరాలా రూ.ఆరు కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని భోగట్టా. గతంలో ఇదే సబ్బు ప్రకటనలో చిరునవ్వులు చిందించడానికి అందాల తార కత్రినాకైఫ్‌కి 4 కోట్ల రూపాయలే ఇచ్చారు. ఇదంతా హిట్ మహిమ అంటున్నారు సినీ వర్గాలు .

    ఇక దీపిక పదుకొనె ఇటీవల 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి జోరుమీదుంది. దీంతో పాటు హాలీవుడ్ మూవీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్రంలో కూడా చాన్స్ దక్కడంతో అమ్ముడు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తాజాగా దీపిక గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. త్వరలో దీపిక పదుకొనె తన అభిమానులను బార్ గర్ల్‌గా అలరించబోతోంది. బాలీవుడ్లో తెరకెక్కబోతున్న 'హ్యాపీ న్యూ ఈయర్' సినిమాలో దీపిక బార్ డాన్సర్‌గా కనిపించబోతోంది. తన ఫ్యామిలీతో వెకేషన్ పూర్తయిన తర్వాత నేరుగా వచ్చి 'హ్యాపీ న్యూ ఈయర్' సినిమాలో పాల్గొనబోతోంది.

    ఈ సినిమాలో దీపిక పదుకొనె సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. హ్యాపీ న్యూ ఈయర్ చిత్రానికి ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, దీపిక, అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ, సోను సూద్, వివాయ్ సాహ్, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మొదటి నుంచీ ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకురాలు ఫరాఖాన్ రహస్యంగా ఉంచుతూ వస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈచిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Bollywood actress Deepika Padukone is on the top of everyone's lists. Be it a person's favourite actress, choice for a movie or a commercial, she has topped it all. We think now is the time to say that Deepika is highly in demand. She is going non-stop on her success ladder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X