»   » రణవీర్ వల్ల గర్భం: క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ దీపిక పదుకోన్!

రణవీర్ వల్ల గర్భం: క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ దీపిక పదుకోన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్, యంగ్ హీరో రణవీర్ సింగ్ కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్నపుడు ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం 'xXx' అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న దీపిక పదుకోన్ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రణవీర్ సింగ్ దగ్గరకు రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతోంది. ఇటీవల రణవీర్ విదేశాల్లో షూటింగులో ఉండగా నేరుగా సెట్లో దిగేసింది. అక్కడ షూటింగ్ ముగియగానే ఇద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేసారని టాక్.

కాగా... కొన్ని రోజులుగా ఈ జంటపై ఓ కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఇందుకు ఒప్పుకున్నారని ఆ వార్తల సారాంశం. బుధవారం రాత్రి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక దీనిపై స్పందించారు.

'ఈ వార్తలపై స్పందించేందుకు ఇదే సరైన సమయం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు. నేను గర్భవతిని కాదు. పిల్లలు కూడా లేరు. నాకు ఇంకా పెళ్లి కాలేదు' అంటూ సమాధానం ఇచ్చింది. దీపిక అలా మాట్లాడటంతో మీడియా వారు ఆశ్చర్యపోయారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు..

ప్రెగ్నెంట్?

ప్రెగ్నెంట్?

అయితే దీపిక పదుకోన్ తాను గర్భవతి కాదు అని కామెంట్ చేయడానికి కారణం అప్పట్లో రణవీర్ వల్ల దీపిక్ పదుకోన్ గర్భం దాల్చిందంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి.

ఇప్పుడు

ఇప్పుడు

అప్పట్లో ఆ వార్తల గురించి పెద్దగా పట్టించుకోని దీపిక ఇపుడు క్లారిటీ ఇచ్చింది. తానే గర్భం దాల్చలేదని స్పష్టం చేసింది.

పెళ్లి ఆలోచన లేదంటే..

పెళ్లి ఆలోచన లేదంటే..

ప్రస్తుతం దీపికతో పాటు రణవీర్ సినీ కెరీర్ మంచి ఫాంలో ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు.

చెప్పలేం

చెప్పలేం

అసలు వీరి లవ్ ఎఫైర్ పెళ్లి వరకు వెలుతుందో లేదో కూడా చెప్పడం కష్టమే. గతంలో దీపిక రణబీర్ సింగ్ తో లవ్ ఎఫైర్ నడిపింది. అతనితో విడిపోయింది. ఇపుడు రణవీర్ తో....

English summary
"I think this is the right opportunity to clarify for everyone, there is no such plan (to get married). I am not pregnant, I am not having a baby, I am not engaged. I am not married and I am not planning to get married anytime soon," Deepika Padukone told reporters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu