»   » మాగ్జి(మ)మ్ అందం మనదే.., వరల్డ్ హాటెస్ట్ వుమెన్ గా మన నల్లపిల్ల

మాగ్జి(మ)మ్ అందం మనదే.., వరల్డ్ హాటెస్ట్ వుమెన్ గా మన నల్లపిల్ల

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపిక పదుకొనే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ చేరాలని కలలు కనే చాలామందిని దాటి అక్కడ అడుగు పెట్టి న ఒకరిద్దరిలో ఈమే ఒకరు. హాలీవుడ్ తెరమీద ఈ దక్షిణాది అందం మెరిసి పోదామని చేసిన ప్రయత్నం క్నిరాశ పరిచినా అక్కడ ఏ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఈవెంట్‌లో అయినా తనే ముందుండి మెరిసిపోయింది.

తెల్ల తోలు మాత్రమే కాదనీ

తెల్ల తోలు మాత్రమే కాదనీ

ఆమె హాలీవుడ్‌ ప్రయత్నం ఆశించిన ఫలితాలని ఇవ్వకపోయి వుండొచ్చు కానీ దీపిక ఇప్పుడు ఇంటర్నేషనల్‌ ఐకాన్‌గా మారింది. భారతీయ స్త్రీలు అంతర్జాతీయ భామలకి ఏమాత్రం తీసిపోరనీ అందం అంటే తెల్ల తోలు మాత్రమే కాదనీ నిరూపించింది దీపికా., సహజంగానే క్రీడాకారులకి ఓటమిని ఒప్పుకోవటం ఇష్టం ఉండదు, తండ్రి ప్రకాశ్ పదుకుణే నుంచి ఆమెకు వచ్చిన క్వాలిటీ ఆ గుణమేనేమో. దీపికా కూడా ఒకప్పుడు బ్యాట్మింటన్ క్రీడాకారిణి నే కదా.

విచిత్రమైన దుస్తుల్లో

విచిత్రమైన దుస్తుల్లో

ఒక దశలో ఆమె వేసుకునే దుస్తులు ఫ్యాషన్ ప్రపంచం లో చిన్న పాటి కలకలం రేపాయి, చిన్న చిన్న బికినీలను వేసుకుని ఒక పక్క హాట్ గానూ మరో పక్క ఆత్మవిశ్వాసం ప్రతిబింబించేవి గానూ చిత్ర విచిత్రమైన దుస్తుల్లో తన అందచందాలని ఒలకబోసిన ఈ సౌతిండియన్ ఒంపుల భామతో పోటీ పడేందుకు చాలా మందే తపన పడ్డారు.

టాప్ హాట్ గాళ్స్

టాప్ హాట్ గాళ్స్

బాలీవుడ్ టాప్ హాట్ గాళ్స్ అని పిలిపించుకునే ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లాంటి వాళ్లు చాలా మెట్లు దిగాల్సి వచ్చింది. అదే పనిగా బికినీల్లో కనిపించి మీడియా దృష్టిని ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఈ నల్ల పిల్ల ఏమాత్రం తన గ్రేస్ ని కోల్పోలేదు.

హాటెస్ట్‌ వుమన్‌'గా

హాటెస్ట్‌ వుమన్‌'గా

హాలీవుడ్ తెరమీదకి చేరిన దీపికా లో తెల్లని రంగూ, నీలి కల్లూ, జీరో సైజూ లాంటి సెక్స్ అప్పీల్స్ ఏవీ లేవు ఆ కళ్ళలో కనిపించే ఒక సెల్ఫ్ కాన్ఫిడెసే దీపిక లో అయినప్పటికీ మాగ్జిమ్‌ పత్రిక టాప్‌ 100 మంది హాట్‌ స్త్రీల గురించి నిర్వహించిన పోల్‌లో ఈ ఏడాదికి 'హాటెస్ట్‌ వుమన్‌'గా దీపిక కిరీటాన్ని గెలుచుకుంది. అంతమందిలో తనకే ఎందుకు నంబర్‌వన్‌ స్థానం దక్కిందనే అనుమానమే రానవసరం లేకుండా కవర్‌పేజీ స్టిల్‌తోనే దీపిక డౌట్స్‌ అన్నీ తీర్చేసింది.

English summary
Deepika Padukone entered Maxim's 2017 list of 100 Hot Women and topped its India chapter. She covered the latest issue of Maxim India in Swapnil Shinde separates
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu