Pregnancy పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపిక పదుకోన్.. డెలివరీ డేట్ ఎప్పుడంటే?
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త ఇంకా ట్రెండింగ్‌లో ఉండగానే మరో స్టార్ బాలీవుడ్ జంట శుభవార్తను తమ అభిమానులకు అందించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్ దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ దంపతులు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ వార్తను స్వయంగా దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీపిక షేర్ చేసిన వివరాల్లోకి వెళితే..
గత కొద్దికాలంగా దీపిక గర్బవతి అంటూ వార్తలు మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాయి. అయితే వాటిపై దీపిక గానీ, రణ్‌వీర్ సింగ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన గానీ, స్పందన గానీ రాలేదు. దాంతో ఆ వార్త గాసిప్ అని అనుకొన్నారు. కానీ ఆ వార్తకు బాలీవుడ్ మీడియాలో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

అయితే ఇటీవల అంతర్జాతీయ అవార్డుల వేదికపై దీపిక బాడీ లాంగ్వేజ్ గర్బవతి అనే వార్తలకు బలం ఇచ్చేలా చేసింది. తన గర్బంపై కొంగును కప్పుకొనే ప్రయత్నం చేయడం, ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపించడంతో ఆమె గర్బవతి అనే విషయంపై చర్చ జరిగింది.

అయితే ఇలాంటి వార్తలు మీడియాలో ట్రెండింగ్ అవుతున్న నేపథ్యంలో పుట్టబోయే తమ సంతానం గురించి దీపిక, రణ్‌వీర్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. తమకు సెప్టెంబర్ 2024లో బిడ్డ పుట్టబోతుందని అధికారికంగా వెల్లడించారు. దాంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











