దర్శకుడిని కొట్టి, షారుఖ్‌కు పంచ్ ఇచ్చిన దీపిక (ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, దీపిక పడుకొనె జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'చెన్నై ఎక్స్‌ప్రెస్'. ఇటీవలే ఈచిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగులో చివరి రోజు జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో తన ట్విట్టర్లో పోస్టు చేసింది దీపిక.
రోహిత్ శెట్టి స్టైల్‌లో తన ప్రేమను వ్యక్తం చేసాను అంటూ ఆ వీడియోకు కామెంట్ చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా?....షారుఖ్‌కు పంచ్ ఇవ్వడంతో పాటు, దర్శకుడు రోహిత్ శెట్టి తలపై బాటిల్ బద్దలు కొట్టిన సన్నివేశాలు. లాస్ట్ డే షూటింగ్ సందర్భంగా సినిమా ప్రచారం నిమిత్తం ఈ ఫన్నీ వీడియోను షూట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. చివరి రోజు షూటింగ్ సెట్లో అంతా ఉత్సాహంగా కనిపించారు.
ఈ సినిమా కథలో షారూక్ ..ముంబై నుంచి రామేశ్వరం కు వెళ్లే వ్యక్తిగా కనిపించనున్నారు. రోహిత్ శెట్టి గత చిత్రాలు చూసిన షారూఖ్ ఇంప్రెస్ అయి తన డేట్స్ ఇవ్వటానికి ముందుకు రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కింది. దర్శకుడు రోహిత్ శెట్టి మాట్లాడుతూ..నిజానికి షారూఖ్ ని ఇంప్రెస్ చేయటం అంత ఈజీ కాదు. ఆయనతో మంచి యాక్షన్ కామెడీ చేయాలనేది నా కోరిక..ఎలా చేసినా షారూఖ్ అభిమానులను అలరించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారు. ఆగస్టు 8న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
స్లైడ్ షోలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చివరి రోజు షూటింగ్ దృశ్యమాలిక...

చెన్నై ఎక్స్‌ప్రెస్ సెట్లో దీపిక

షారుక్ కు పంచ్ ఇస్తున్న దీపిక, ఇదంతా సరదాగా జరిగిందే

దీపికకు పంచ్ ఇవ్వడంలో మెళకువలు నేర్పుతున్న షారుక్ ఖాన్

చివరి రోజు షూటింగ్ కావడంతో అంతా సందడిగా గడిపారు

చెన్నై ఎక్స్ ప్రెస్ ఫస్ట్ లుక్ పోస్టర్


Click it and Unblock the Notifications











