»   » బార్‌డాన్సర్‌గా హాట్ బ్యూటీ దీపిక పదుకొనె!

బార్‌డాన్సర్‌గా హాట్ బ్యూటీ దీపిక పదుకొనె!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె ఇటీవల 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి జోరుమీదుంది. దీంతో పాటు హాలీవుడ్ మూవీ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' చిత్రంలో కూడా చాన్స్ దక్కడంతో అమ్ముడు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తాజాగా దీపిక గురించి మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

త్వరలో దీపిక పదుకొనె తన అభిమానులను బార్ గర్ల్‌గా అలరించబోతోంది. బాలీవుడ్లో తెరకెక్కబోతున్న 'హ్యాపీ న్యూ ఈయర్' సినిమాలో దీపిక బార్ డాన్సర్‌గా కనిపించబోతోంది. తన ఫ్యామిలీతో వెకేషన్ పూర్తయిన తర్వాత నేరుగా వచ్చి 'హ్యాపీ న్యూ ఈయర్' సినిమాలో పాల్గొనబోతోంది.

ఈ సినిమాలో దీపిక పదుకొనె సరికొత్త అవతారంలో కనిపించబోతోంది. హ్యాపీ న్యూ ఈయర్ చిత్రానికి ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, దీపిక, అభిషేక్ బచ్చన్, బోమన్ ఇరానీ, సోను సూద్, వివాయ్ సాహ్, జాకీ ష్రాఫ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

మొదటి నుంచీ ఈ సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకురాలు ఫరాఖాన్ రహస్యంగా ఉంచుతూ వస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నయి. రెడ్ చిల్లీస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈచిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
We recently told you that Deepika Padukone has bagged a role in the seventh installment of the fast and furious series. Well, it looks like the actress is racing ahead just like her recent film Chennai Express. She has been having back-to-back hit movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu