వరల్డ్ సెక్సీయెస్ట్ ఉమెన్ ఆమెనే అని తేల్చారు (ఫోటోలు)
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ సెక్సియెస్ట్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్‌గా ఎన్నికైంది. ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది ఆమెకే ఓటు వేసారు. వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్ ఎవరనే అంశంపై ఆన్ లైన్ సర్వే నిర్వహించి మొత్తం 100 మందితో కూడిన లిస్టును విడుదల చేసారు.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఎఫ్‌హెచ్‌ఎం న్యూ ఎడిషన్ కవర్ పేజీ దీపిక ఫోటోను ప్రచురించారు. దీన్ని ఆమె బుధవారం ఆవిష్కరించారు. తొలి వంద మందిలో చోటు దక్కించుకున్న వారి వివరాలు ఇందులో పొందు పరిచారు. తనకు మొదటి స్థానం రావడానికి కారణం సినిమాల్లో తన పని తీరు కూడా ఓ కారణం. కేవలం నా శరీర అందంతో ఈ పేరు వచ్చిందని నేను అనుకోవడం లేదని దీపిక పదుకోన్ తెలిపారు.
గత రెండు మూడు సంవత్సరాలుగా నేను సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను. నేను చేసే వివిధ రకాల క్యారెక్టర్లు నాలోని టాలెంటును నిరూపించుకోవడానికి ఎంతో సహకరించాయి అని దీపిక పదుకోన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి సెక్సియోస్ట్ ఉమెన్ అంటే కేవలం శరీర అందం మాత్రమే కాదు....చాలా విషయాలు అందులో ముడి పడి ఉంటాయని చెప్పుకొచ్చింది దీపిక.

ఎఫ్ హెచ్ ఎం కవర్ పేజీపై...
ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కవర్ పేజీపై దీపిక పదుకోన్ ఇలా సెక్స్ లుక్స్‌తో దర్శనమిచ్చింది.

న్యూ ఎడిషన్ ఆవిష్కరిస్తున్న దీపిక
బుధవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్ హెచ్ ఎం న్యూ ఎడిషన్ విడుదల చేస్తున్న దీపిక.

హాట్ లుక్
ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇలా ఆరెంజ్ హాట్ లుక్‌తో హాజరైంది దీపిక పదుకోన్.

సినిమాలు
సినిమాల విషయానికొస్తే దీపిక పదుకోన్ ప్రస్తుతం అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫైండింగ్ ఫన్నీ' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి హోమి అడజనియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, డింపుల్ కపాడియా కూడా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











