రాణీ పద్మావతి ఇప్పుడు ఆన్లైన్‌లో బట్టలమ్ముతోంది: కొత్త క్లాతింగ్ బ్రాండ్‌తో దీపికా పదుకొణే

సినిమాలతో పాటు యాడ్ ఫీల్డ్‌లో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. ఈ జాబితాలో డస్కీబ్యూటీ దీపికా పదుకొనే మిగతా భామల కంటే ముందంజలో ఉంది.

సినిమాలతో పాటు యాడ్ ఫీల్డ్‌లో కూడా రెండు చేతులా సంపాదిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. ఈ జాబితాలో డస్కీబ్యూటీ దీపికా పదుకొనే మిగతా భామల కంటే ముందంజలో ఉంది. అయితే సినిమాలు, యాడ్ ఫిల్మ్స్‌తో పాటుగా తాజాగా ఆన్ లైన్ మార్కెట్ లో బిజినెస్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయిందట దీపికా.

Recommended Video

Padmavathi : Karni Sena Members Vandalise Cinema Hall In Kota Over Trailer Screening
ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్

ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్

ఇందుకోసం ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్ మైంత్ర ను సెలెక్ట్ చేసుకుందట. దీనిలో దీపికా సొంత బ్రాండ్ అయిన 'ఆల్ అబౌట్ యూ' దుస్తులను విక్రయించబోతున్నారని టాక్. సినిమాల్లో మరో పక్క యాడ్ ఫీల్డ్ లో తనకు ఫుల్ పాపులారిటీ లభిస్తుండటంతో ఈ క్రేజ్‌ను తన ఆన్ లైన్ బిజినెస్ ద్వారా క్యాష్ చేసుకోడానికి దీపికా ప్రయత్నిస్తోంది.

ఆడవారికే ప్రత్యేకం

ఆడవారికే ప్రత్యేకం

యితే అవి కేవలం ఆడవారికే ప్రత్యేకం. ఆమె చెప్పేది దేని గురించి అంటే....లేడీస్ ఫ్యాషన్ గురించే. ఇప్పుడు ఈ అమ్మడు కూడా సొంత దుకాణం తెరిచింది. కానీ అది కేవలం ఆన్లైన్లో అవడం విశేషం. ఈమధ్య బాగా ఊపుమీదున్న ఆన్లైన్ సెగ్మెంట్ ని దీపిక బాగానే ఒంటపట్టించుకుంది.

 ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్

ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్

ఈ బ్రాండ్ పై మహిళల దుస్తులను మాత్రమే విక్రయిస్తారు. నేటి తరం మహిళామణులు కోరుకునే ఫ్యాషన్ కి అనుగుణంగా అన్ని రకాలు ఉంటాయని చెప్తోంది దీపిక. ఇందుకోసం ఆన్ లైన్ ఫ్యాషన్ పోర్టల్ మింత్ర ను సెలెక్ట్ చేసుకుంది.

ఆల్ అబౌట్ యు

ఆల్ అబౌట్ యు

"ఆల్ అబౌట్ యు" అంటూ ఓ కొత్త క్లాతింగ్ బ్రాండ్ ను స్టార్ట్ చేసింది దీపికా పదుకొనే. ఈ కామర్స్ పోర్టల్ మింత్రా తో కలిసి ఈ బ్రాండ్ ను లాంఛ్ చేసిన దీపిక.. ఆ బ్రాండ్ డ్రెస్సులు వేసుకుని తెగ పోజులు ఇచ్చేసి.. ఫోటోలు దిగేసింది.

తనే బ్రాండ్ అంబాసిడర్

తనే బ్రాండ్ అంబాసిడర్

తన సొంత బ్రాండ్ కోసం.. దీపిక తనే బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తగా.. ఇప్పటికే ఇదే తరహా వ్యాపారాన్ని పలువురు బాలీవుడ్ స్టార్స్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ అనుష్క శర్మ NUSHఅనే బ్రాండ్ ను స్టార్ట్ చేయగా.. సోనమ్ కపూర్ కు చెల్లెలు రియాతో కలిపి RHESON అనే ఓన్ బ్రాండ్ ఉంది.

సొంత బ్రాండ్స్

సొంత బ్రాండ్స్

అందాల భామలు మాత్రమే కాదు.. హీరోలు.. క్రికెటర్లు కూడా ఇలా సొంత బ్రాండ్స్ ను డెవలప్ చేసుకుంటున్నారు. హృతిక్ రోషన్ కు HRX అనే సొంత బ్రాండ్ ఉంది. దీనిపై ఎలక్ట్రానిక్స్ నుంచి అనేక ప్రొడక్ట్స్ కు కోబ్రాండింగ్ కూడా చేస్తుంటాడు. మరోవైపు.. టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి 'WROGN'అనే సొంత బ్రాండ్ ఉంది. తమ స్టార్ స్టేటస్ ను సెలబ్రిటీలు వ్యాపారానికి భలే ఉపయోగించుకుంటున్నారు కదూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X