అందమైన మగాళ్లను చూసి ఆకర్షితులమవడం సహజం..!

By Sindhu

'ఏదైనా కానీ అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదంటారు. ముఖ్యంగా విఫల ప్రేమ ప్రేమికులకు కొన్ని కఠోర జీవిత సత్యాల్ని భోదిస్తుంది. అందుకు బాలీవుడ్ సొగసరి దీపికాపదుకునే మినహాయింపేం కాదు. సెలబ్రిటీలుగా వుండటం వల్ల మనశ్శాంతి కరువైపోయింది అంటోంది ఈ భామ. అంతేకాదు సెలబ్రిటీ హోదా వల్ల ఏ చిన్న విషయమైనా పదేపదే మీడియాలో చర్చకు వస్తుందంటోంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌ మైండ్‌ తో వుండటం తన మనస్తత్వమని సెలవిస్తోంది.

'రణభీర్ కపూర్‌ తో ప్రేమ వ్యవహారాన్ని మీడియా చాలా పెద్దది చేసి చూపించింది. అతనితో తెగతెంపులు చేసుకున్నాక కూడా రణభీర్ కుటుంబ సభ్యులు తనపై చేసిన ఆరోపణలు బాధించాయంటోంది. సినీరంగంలో ఇద్దరు సమ ఉజ్జీల మధ్య ప్రేమ వ్యవహారంలో చాలా ఇబ్బందులొస్తాయని, తరచూ ఇగో ప్రాబ్లెమ్స్‌ తో సతమతమవుతారని చెబుతోంది. ముఖ్యంగా ప్రేమ గురించి తన అనుభంలో ఓ గొప్ప విషయం తెలుసుకున్నానంటోంది. 'అందంగా వున్న మగాళ్లను చూసి ఆకర్షితులమవడం చాలా సహజం.

అయితే అందం ప్రాదిపదికగానే వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం. కొన్ని సార్లు పరిచయం పెరుగుతున్న కొద్ది వారి గురించి తెలిసే వాస్తవాలు భయంకరంగా వుంటాయి. అందం కంటే వ్యక్తిత్వమే ప్రధానమని నా కర్థమయింది" అంటూ సరికొత్త ఫిలాసఫీని చెబుతోంది ఈ సుందరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X