శ్వేతాబసు విషయమై దీపికా పదుకోని ఇలా...
ముంబై : వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు విషయమై బాలీవుడ్ నటులు అంతా స్పందిస్తూ ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి....సహాయం చేయమంటూ సూచిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోని ఈ విషయమై సీరియస్ గా స్పందించారు.
ఆమె మాట్లాడుతూ...
" ఇది చాలా విచారకరం, కానీ ఆమె తన కుటుంబాన్ని నడపటానికి ఇదొక్కటే దారి ఉంటే దాన్ని నేను తప్పు పట్టను. అయినా ఈ విషయాన్ని ఓ స్కాండల్ గా మార్చే బదులు, ఎందుకు ఆమెకు సహాయం చేయటానికి ముందుకు రారు... ఆమెను హైర్ చేసుకున్న వ్యక్తులు గురించి ఎందుకు మాట్లాడరు... ఆమెను చిన్నచూపు చూడకండి..., చేతనైతే సహాయం చేయండి ," అన్నారామె.

ఇక రెండు రోజల క్రితం తమిళ మాజీ హీరోయిన్, ప్రస్తుత రాజకీయ నాయకురాలు ..ఖుష్బూ ఈ విషయమై మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందులు, సినిమాల్లో అవకాశాలు లేనంతమాత్రాన వ్యభిచార కూపంలోకి దిగడమేనా అంటూ ఇటీవల అరెస్టయిన నటి శ్వేతాబసుకు సీనియర్ నటి కుష్బూ అన్నారు.
మరో ప్రక్క శ్వేతబసు తీరుని నిరశిస్తునే ఆమె పరిస్దితికి జాలిపడుతూ, మీడియాని తప్పుబడుతూ ఇండస్ట్రీలోని వారు సపోర్టు చేస్తున్నారు. సినిమా హీరో మంచు విష్ణు సైతం ఈ విషయమై మాట్లాడారు. తన తదుపరి చిత్రంలో వేషం ఇస్తానంటూ ప్రకటించారు. తనకు ఇలా జరగటం చాలా బాధాకరం అని అన్నారు. మిగతా సినీ సెలబ్రెటీల సైతం ఈ విషయమై స్పందించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్వేతాబసు వ్యభిచారంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా అవకాశాలు మాత్రమే ఆమెకు ఊరటనివ్వగలవని అభిప్రాయపడుతున్నారు.కాగా, ప్రాస్టిట్యూషన్ అనేది కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేయడంలో అర్థం లేదని, శ్వేతాబసుకు టాలెంట్ ఉంటే తిరిగి సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు.
సామాజిక వెబ్‌సైట్ ద్వారా పలువురు శ్వేతాబసు పట్ల జాలి చూపిస్తున్నారు. శ్వేతాబసు పేరు మాత్రమే మీడియాలో వస్తోందని, కానీ, ఈ వ్యవహారంలో ఉన్న వ్యాపారవేత్తల పేర్లు మాత్రం బయటికి రావడం లేదని అంకా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











