అందుకే దీపిక పడ్కోని తెలుగులో..
దీపికా పడుకోని తెలుగులో లవ్ ఫర్ ఎవర్ అనే చిత్రంలో ఓ సాంగ్ చేస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఏ తెలుగు చిత్రానికి డేట్స్ ఇవ్వని ఆమె ఇలా హఠాత్తుగా ఓ సినిమాకి కమిట్ అవటం అందరినీ అశ్చర్యంలో పడేసింది. అయితే దానికి కారణం ఆమే చెప్పుకొచ్చింది. నా దగ్గరకు వచ్చి దర్సకుడు జయంత్ ఆ సాంగ్ వినిపించారు. ఆ పాట, కాన్సెప్ట్ నన్ను చాలా బాగా ప్రేరేపించాయి. ఆ సినినాలో పెద్ద స్టార్స్ ఎవరూ లేరు...అంతా కొత్త వాళ్ళే. అందుకే నేను మొదట ఈ ప్రపోజల్ కి సమ్మతించాను. ఎందుకంటే నేనూ ఒకప్పుడు కొత్త దాన్నే. ఆ పొజీషన్లో ఉన్నదాన్నే..అందుకే వారిని ఎంకరేజ్ చేయాలనిపించింది. అంతకుమించి మరేమీలేదు. నేను నా హిందీ సినిమాలతో పూర్తి స్ధాయి బిజీలో ఉన్నాను. నేను ఈ సినిమా విజయానికి కాస్త సహాయం చేయగలిగినా సంతోషిస్తాను అంది. ఎదిగినా ఒదిగినట్లుండే ఆమె న్యాచుర్ ని, మాటలను, ఇప్పుడంతా మెచ్చుకుంటున్నారు. ఇక జయంత్ ఆమెకు యాడ్ ఫిలిమ్స్ డైరక్టర్ గా గతంలోనే పరిచయం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











