»   » షాకింగ్ ఆన్సర్: విన్ డీజిల్ తో శారీరక సంబందం ఉన్నట్టే... డైరెక్ట్ గా ఒప్పేసుకున్న దీపికా ?

షాకింగ్ ఆన్సర్: విన్ డీజిల్ తో శారీరక సంబందం ఉన్నట్టే... డైరెక్ట్ గా ఒప్పేసుకున్న దీపికా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతి కానుకగా భారత్ లో విడుదలైన "ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్" సినిమా పట్ల విమర్శకులు పెదవి విరిచిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే ఈ సినిమా ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో... చిత్ర యూనిట్ అమెరికాలో పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా, స్థానికంగా విశేషమైన ఆదరణ పొందిన టాక్ షో 'డిజెనరస్'లో పాల్గొన్న దీపికా పదుకునే హోస్ట్ కే దిమ్మతిరిగేలా బోల్డ్ గా బోల్డన్ని క్లారిటీలు ఇచ్చేసింది. గంటకు పైగా సాగిన ప్రోగ్రాం లో అడిగిన ప్రశ్నలన్నిటికీ అలా...ఇలా అంటూ సాగదీయకుండా ఫాస్ట్ గా అంతే బోల్డ్ గా చెప్పేసింది దీపికా పదుకుణే.

కొన్ని ఆన్సర్లు పరవాలేదనిపించినా... ఆఖరున చెప్పిన ఆన్సర్ కి మాత్రం బాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కిపడింది. నిన్నా మొన్నటివరకూ కేవలం ఊహల్లో ప్రేమిస్తున్నా అని చెప్పిన దీపికా "సంచలనం కోసం చెప్పిందో లేక నిజంగానే ఒప్పేసుకుందో గానీ... విన్ డీజిల్ తో తనకు శారీక సంబందం ఉన్నట్టు ఒప్పేసుకుంది....

 Deepika Padukone Openes Up About Affair With VinDiesel

త్వరలోనే XXX సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో దీపిక అమెరికాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ హాలీవుడ్ హీరో విన్ డిజెల్ తో తనకు శృంగార సంబంధం ఉందని పరోక్షంగా అంగీకరించింది.

డైరెక్ట్ గా కాదు కానీ జనం అనుకుంటున్నారు అంటే అందులో ఎంతోకొంత నిజం ఉంటుంది కదా అన్నట్టు స్పందించటం షాకింగ్ గా మారింది. అమెరికాలో విశేషమైన ఆదరణ పొందిన టాక్ షో డిజెనరస్ లో దీపిక పాల్గొంది.... సినిమా ప్రచారం నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర సమాధానాలు చెప్పింది.

 Deepika Padukone Openes Up About Affair With VinDiesel

విన్ డీజిల్ తో తన అనుబంధం ఊహాజనితమైనదని .. అందులో పిల్లల్ని కన్నా ఎలాంటి ఇబ్బంది లేదంటూ గతంలో చెప్పిన అంశాలనే చెప్పింది. అయితే... 'విన్ డీజిల్ తో నీకు శృంగార సంబంధం ఉందని అంతా అనుకుంటున్నారు కదా మరి మీరేమంటారు?" అన్న డిజెనరస్ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం మాత్రం ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది.

విన్ డీజెల్ తో నీకు శృంగార సంబంధం ఉందా అన్న ఆ ప్రశ్నకు ఆమె... 'నిప్పు లేనిదే పొగరాదు కదా?' అంటూ సమాధానం చెప్పడం గమనార్హం. అంటే తమ మధ్య ఆ సంబంధం ఉన్నట్లు దీపిక అంగీకరించినట్లే అనుకుంటున్నారు బాలీవుడ్ జనం. అంతా బాగానే ఉంది కానీ పాపం రణ్ వీర్ సింగే ఈ మాటలని ఎలా తీసుకుంటాడంటూ బాలీవుడ్ లో జోకులు పేలుతున్నాయి..

English summary
"There is no smoke without fire," Padukone said, when DeGeneres asked the actress if there was something going on between Diesel and her.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu