twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రికెట్ అభిమానులకు మూడ్ తెప్పిస్తున్న దీపిక

    By Bojja Kumar
    |

    ముంబై: క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే 2015 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తన అభిమానులకు క్రికెట్ మూడ్ తెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ సారి వరల్డ్ కప్ టోర్నీలో వేసుకునే జెర్సీ ధరించి దర్శనమిచ్చింది.

    ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ సిక్కా దీపిక పదుకోన్ టీమిండియా జెర్సీ ధరించి లుక్‌ను తన కెమెరాలో బంధించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను దీపిక పదుకోన్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ప్రస్తుతం అంతటా క్రికెట్ ఫీవర్ మొదలవుతున్న నేపథ్యంలో ఈ ఫోటో ఆకట్టుకుంటోంది.

    Deepika Padukone Poses Wearing World Cup Team India Jersey

    ఈ సారి టీమిండియా జట్టు నైక్ కంపెనీకి చెందిన జెర్సీని ధరించబోతున్నారు. ఇదే జర్సీని ధరించడంతో దీపిక పదుకోన్ స్పోర్టీ లుక్ సొంతం చేసుకుంది. టీమిండియా కంటే ముందుగానే తాను ఈ జెర్సీ ధరించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని దీపిక పదుకోన్ చెప్పుకొచ్చారు.

    ‘నేను క్రికెట్ వీరాభిమానిని. ఈ సారి వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ధరించబోయే జెర్సీని నేను ముందుగా ధరించడం గర్వంగా ఫీలవుతున్నాను. టీమిండియా క్రికెట్ అభిమానిగా ఈ సారి విజయం మనకే దక్కుతుందని ఆశిస్తున్నాను అంటూ దీపిక పదుకోన్ తన మనసులోని మాటలు బయట పెట్టింది.

    English summary
    With the Cricket World Cup 2015 arriving fast, actress Deepika Padukone sets the mood for the biggest sport extravaganza in India. Renowned photographer Bharat Sikka captured Deepika Padukone in a unique frame with she proudly wearing the Team India jersey.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X