దీపిక పెళ్లి రిసెప్షన్‌.. రణ్‌వీర్ సింగ్ చిలిపి పని.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఆ సెలబ్రిటీ

Recommended Video

Deepika -Ranveer Bangalore Wedding Reception : Ranveer Gives Flying Kiss To Deepika | Filmibeat

బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరుగుతున్నది. బెంగళూరు లీలా ప్యాలెస్ హోటల్‌లో జరుగుతున్న విందుకు భారీగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు తరలివచ్చారు. దీపిక పదుకోన్ తండ్రి, ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకోన్ తన స్నేహితులను, సినీ, వ్యాపార వర్గాలను భారీగా ఆహ్వానించారు. ఎవరెవరూ హాజరువుతున్నారంటే..

దీపిక, రణ్‌వీర్ చేతిలో చేయి

దీపిక, రణ్‌వీర్ చేతిలో చేయి

పెళ్లి రిసెప్షన్‌ కోసం దీపిక, రణ్‌వీర్ సింగ్ చేతిలో చేయి వేసుకొని ప్యాలెస్ మెట్ల మీద నుంచి నడుచుకొంటూ వచ్చారు. అక్కడి నుంచి మీడియా కెమెరాలకు ఫోజు ఇచ్చే వేదిక వద్దకు చేరుకొన్నారు. ఆ తర్వాత ఫొటోగ్రాఫర్లు పోటీ పడి ఫొటోలు తీసుకొండగా, నవ దంపతులు చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చారు.

వేదిక వద్ద ఆసక్తికరమైన సంఘటన

వేదిక వద్ద ఆసక్తికరమైన సంఘటన

దీపిక, రణ్‌వీర్ సింగ్ వేదిక వద్దకు చేరుకోగానే ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దీపిక కట్టుకొన్న చీర సరిగా లేకపోవడాన్ని గ్రహించిన రణ్‌వీర్ స్వయంగా తన చేతులతో సరిచేశారు. ఆ తర్వాత నవ్వుతూ తన భార్యకు గాలిలో ముద్దు విసిరేసి సంతోషంలో మునిగిపోయాడు. ఆ తర్వాత రణ్‌వీర్‌ను దీపిక కౌగిలించుకోవడంతో ఫొటోలు క్లిక్ మనిపించారు.

దక్షిణాది చిత్ర ప్రముఖులు

దక్షిణాది చిత్ర ప్రముఖులు

దీపిక పదుకోన్ పెళ్లి రిసెప్షన్‌కు తమిళ, తెలుగు, హిందీ, మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. కన్నడకు చెందిన ఉపేంద్ర, కిచ్చ సుదీప్, యష్, పునీత్ రాజ్ కుమార్, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు హాజరుకానున్నారు.

దేశవ్యాప్తంగా క్రీడాకారులు

దేశవ్యాప్తంగా క్రీడాకారులు

దీప్‌వీర్ పెళ్లికి దేశవ్యాప్తంగా క్రీడాకారులు కూడా హాజరుకానున్నారు. అనిల్ కుంబ్లే దంపతులు ఇప్పటికే హాజరుకాగా, రాహుల్ ద్రావిడ్ కూడా హాజరయ్యే ప్రముఖుల జాబితాలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్లు కూడా తరలివచ్చే అవకాశం ఉంది.

ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు

ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు

దీపిక పెళ్లి రిసెప్షన్‌లో ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రత్యేక ఆకర్షణగా మారింది. పింక్ రంగు డిజైనర్ దుస్తులు ధరించి చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X