దీపిక-రణవీర్ వివాహ వేడుక ఫస్ట్ ఫోటోస్.... సీ ప్లెయిన్లో వచ్చిన రణవీర్ (వీడియో)
Recommended Video

బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ వివాహం ఇటలీలోని లేక్ కోమోలో బుధవారం వైభవంగా జరిగింది. ఇక్కడి విల్లా దెల్ బాల్బియెనెల్లోలో వైభవంగా వీరి పెళ్లి వేడుక అతికొద్ది మంది అతిథుల మధ్య జరిగింది. నిన్న(నవంబర్ 14) దీపిక కుటుంబ సాంప్రదాయం ప్రకారం కొంకణి స్టైల్‌లో వివాహ వేడుక నిర్వమించారు. నేడు(నవంబర్ 15) రణవీర్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం సింధి స్టైల్ వేడుక జరుగబోతోంది.
ఈ పెళ్లి వేడుకకు మీడియాను దూరంగా ఉంచారు. అతిథులు కూడా పెళ్లి ఫోటోలు తీయొద్దని ఆంక్షలు విధించారు. దీంతో వేడుకకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాలేదు. ఈ కమనీయ కళ్యాణ వైభోగానికి సంబంధించిన దృశ్యాలు చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నప్పటికీ అటు దీపికతో పాటు ఇటు రణవీర్ వారిని వెయిటింగ్‌లో పెట్టారు.


ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఫోటోస్
దీపిక-రణవీర్ వెడ్డింగ్ ఫోటోస్ అఫీషియల్‌గా విడుదల కానప్పటికీ.... దూరం నుంచి కొందరు తీసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలో దీపిక, రణవీర్ సవ్యసాచి డిజైన్ చేసిన దుస్తులు ధరించారు.

కొందరికే ఆహ్వానం, భారీ భద్రత
ఈ వివాహ వేడుకలో ఫ్యామిలీ మెంబర్స్, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. వివాహ వేదిక వద్దకు ఎవరూ రాకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇతరులు ఎవరూ రాకుండా భద్రతా సిబ్బంది లేక్‌లో చిన్న చిన్న బోట్లపై గస్తీ తిరిగారు.

ఇండియాలో గ్రాండ్ రిసెప్షన్
పెళ్లి వేడుకకు ఎవరినీ ఆహ్వానించక పోయినా... బెంగుళూరు, ముంబైలో గ్రాండ్ రిసెప్షన్స్ నిర్వహించబోతున్నారు. బెంగుళూరులో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్లో దీపిక కుటుంబానికి చెందిన ఫ్రెండ్స్, ఇతర బంధువులు పాల్గొంటారు. ముంబైలో జరిగే వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు పాల్గొంటారు. బెంగుళూరులో నవంబర్ 21న, ముంబైలో నవంబర్ 28న వెడ్డింగ్ రిసెప్షన్లు జరుగనున్నట్లు తెలుస్తోంది.

సీ ప్లెయిన్లో
నిన్న జరిగిన వివాహ వేడుకలో... రణవీర్ సింగ్ నీటిపై ల్యాండ్ అయ్యే సీ ప్లోయిన్‌లో వచ్చాడు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











