మాజీ ప్రియుడి రహస్యాలు బయటపెట్టిన దీపిక
ముంబై : మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బలహీనత కలిగి ఉంటారు. కొందరు వాటినికి బయటకు చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పుడూ వాటిని సీక్రెట్‌గానే ఉంచడానికి ప్రయత్నిస్తారు. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. కానీ అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ దీపిక పడుకొనే ఇటీవల అతనికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్‌ను బయట పెట్టింది.
ఇటీవల దీపిక మీడియాతో మాట్లాడుతూ...రణబీర్ కపూర్‌కు బొద్దింకలన్నా, సాలీడు పురుగులన్నా మహా భయమట. సాధారణంగా అంతా వాటిని చూస్తే చంపేయడానికో, బయటకు పంపడానికి ట్రై చేస్తే...రణబీర్ మాత్రం వాటిని చూసి దాక్కుంటాడట. సాధారణంగా ఇలాంటి వాటికి ఎక్కువగా అమ్మాయిలు భయపడుతూ ఉంటారు. కానీ రణబీర్‌కు ఇలాంటి భయం ఉండటం చూసి తాను మొదట్లో ఆశ్చర్య పోయానని వెల్లడించింది దీపిక.
రణబీర్ గురించిన ఈ సీక్రెట్ చాలా ఫన్నీగా ఉంది కదూ. గతంలో కూడా రణబీర్ తన గురించిన కొన్ని సీక్రెట్స్ మీడియా ముందు ఉంచాడు. అతనికి ఫోర్న్ సినిమాలు చూసే అలవాటు కూడా ఉండేదట. ఇందులో వింతేమీ లేదనుకోండి. ఏదో ఒక ఏజ్‌లో ప్రతి ఇక్కరికి ఇలాంటి అలవాటు ఉండే ఉంటుంది. కానీ ఎవరూ ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు.
రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న 'యే జవానీ హై దివానీ' చిత్రం ఈ నెల 31న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ సరసన దీపిక పడుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. ఈచిత్రంలో నిన్నటితరం హాట్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఐటం సాంగ్ చేస్తుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా వీరు పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











