పద్మావతి రిలీజ్ వాయిదా.. కారణం అదేనట..
చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన పద్మావతి చిత్రం రిలీజ్‌ను నిర్మాతలు వాయిదా వేశారు. సెన్సార్ సర్టిఫికెట్ మంజూరులో జాప్యం జరిగినందున పద్మావతి చిత్రాన్ని వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే వివాదాల మధ్య నలుగుతున్న పద్మావతి చిత్రానికి సంబంధించిన కొన్ని పాత్రలు ఇంకా అందలేదని సెన్సార్ బోర్డు వెల్లడించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకొన్నది.
Recommended Video

Padmavati Movie Release Date Postponed Finally
బాలీవుడ్ తారలు దీపికా పదుకొన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రానికి ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ చేశాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1 తేదీన విడుదల చేయాలిని నిర్ణయించారు. సెన్సార్ సర్టిఫికెట్ జాప్యం కావడంతో ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసినట్టు నిర్మాతలు ధృవీకరించారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.

sanjay leela bhansali padmavati deepika padukone postphone సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి దీపికా పదుకొన్ రిలీజ్ వాయిదా


Click it and Unblock the Notifications