»   » దీపికా పదుకొనే: చివరి మూడు ఫొటోలు చూస్తే మీరూ కూడ షాక్ తింటారు...

దీపికా పదుకొనే: చివరి మూడు ఫొటోలు చూస్తే మీరూ కూడ షాక్ తింటారు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హృద్యమైన ప్రేమకథలను తెరతెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ సిద్ధహస్తుడు. ఆయన దృశ్యకావ్యాలు సినీ ప్రియులనే కాక విమర్శకులనూ కట్టిపడేస్తాయి. 'బాజీరావ్ మస్తానీ'తో భారీ హిట్ అందుకున్న భన్సాలీ మరో చారిత్రాత్మక కథను తెరకెక్కించనున్నారు. 12, 13శతాబ్దాలకు చెందిన రాణి పద్మావతి గాథ ఇది. సినిమా పేరు కూడా 'పద్మావతి'గానే నిర్ణయించారు. వివాహితురాలై పద్మావతిని అలౌద్దిన్ ఖిల్జీ మోహించడం.. ఆమె కోసం అతడు సృష్టించిన రక్తపాతం కథాంశంగా ఈ సినిమా రూపొందనుంది. చారిత్రాత్మక కథ...అందులోనూ భన్సాలీ డీల్ చేస్తున్న సబ్జెక్ట్‌ కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఒకప్పడు ప్రేమికులు, ఇప్పుడు దూరం దూరంగా ఉంటున్న రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనే కలిసి పనిచేస్తున్నారు. సంజయ్‌లీలా భన్సాలీ 'పద్మావతి' సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇదే చిత్రంలో నటిస్తున్న షాహిద్‌కపూర్‌తో దీపిక సన్నిహితంగా మసులుతుండటం రణవీర్‌కు మింగుడుపడటం లేదట. ఈ నేపథ్యంలో సినిమాలో దీపికా, రణ్‌వీర్‌ మధ్య కెమిస్ట్రీ ఎలా పండుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాలో రణ్‌వీర్‌, దీపిక కలిసి పంచుకునే సీన్‌ ఒక్కటి కూడా ఉండదట. అందుకే 'పద్మావతి' షూటింగ్‌ కోసం లొకేషన్లు వెతికే పనిలో బిజీగా ఉన్నాడు భన్సాలీ. ఇందులో చిత్తోర్‌ (రాజస్థాన్) రాజు రావల్‌ రతనసింగ్‌ భార్య పద్మావతి సౌందర్యం గురించి విని, ఎలాగైనా ఆమెను తన స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ సుల్తాన అల్లావుద్దీన ఖిల్జీ తపిస్తుంటాడు. అతడు తమ రాజ్యంపైకి దండెత్తివచ్చినప్పుడు పద్మావతి ఏం చేసిందనేది సినిమా ప్రధానాంశం. ఖిల్జీగా రణవీర్‌, రతన్‌సింగ్‌గా షాహిద్‌, అతని భార్య పద్మావతిగా దీపిక నటించనున్నారు. ఈ సినిమా విశేషాలు మరికొన్ని ....

హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గదు:

హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గదు:

భారతీయ చలన చిత్ర చరిత్రలో బాహుబలి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. భారీ తనానికి హాలీవుడ్ చిత్రాలు మాత్రమే చూడాలి అనే అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసిన చిత్రం ఇది. భారతీయ సినిమా కూడా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గదు అని నిరూపించింది.

బాజీరావ్ మస్తానీ:

బాజీరావ్ మస్తానీ:

అయితే బాహుబలిని మించిన స్థాయిలో భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ! రొమాంటిక్ లవ్ స్టోరీని అత్యంత భారీగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు భన్సాలీ. గత చిత్రం ‘బాజీరావ్ మస్తానీ' దేశవ్యాప్తంగా ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఎన్నో అవార్డులూ రివార్డు కూడా అందుకుంది. అయితే ఈ చిత్రంలో భారీ వార్ సీక్వెన్సులు లాంటివి లేవు. ఆ కథ వేరు.

భారీ యుద్ధ సన్నివేశాలు:

భారీ యుద్ధ సన్నివేశాలు:

బాజీరావ్ మస్తానీ తరువాత అంతకంటే మరో భారీ చిత్రం ‘రాణి పద్మావతి'ని ప్రస్తుతం తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈ చిత్రం కూడా సున్నితమైన ప్రేమకథాంశం చుట్టూ అల్లుకున్నదే అని తెలుస్తోంది. అయితే ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇప్పటి నుంచే భారీ అంచనాలు:

ఇప్పటి నుంచే భారీ అంచనాలు:

ఆ వార్ సీక్వెన్సులు బాహుబలి కంటే భారీగా ఉండేలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు అని ముంబై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వార్ సన్నివేశాల్లో భారీతనం అంటే - ప్రస్తుతానికి బాహుబలి చిత్రం మాత్రమే ఒక ల్యాండ్ మార్క్. దాన్ని మించిన స్థాయిలో వార్ ఎపిసోడ్ లు తెరమీదికి వస్తాయంటే... ప్రేక్షకులకు అంతమించిన నయనానందకరం ఏముంటుంది చెప్పండి...? మొత్తానికి భన్సాలీ పద్మావతిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాజీరావ్ సూపర్ హిట్ కావడంతో దర్శకుడు భన్సాలీ కూడా మాంచి ఫామ్ లో ఉన్నాడు.

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌:

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌:

సంజయ్‌లీలా భన్సాలీ సినిమా సెట్స్‌పై కొత్త ప్రేమలు చిగురిస్తాయన్న పేరుంది. డైరెక్టర్‌గా ఆయన మొదటి సినిమా ‘ఖామోషి: ద మ్యూజికల్‌' షూటింగ్‌లో అందులోని ప్రధాన నటులు నానా పటేకర్‌, మనీషా కొయిరాలా ప్రేమలో పడ్డారు. చిత్రమేమంటే ఆ సినిమాలో ఆ ఇద్దరూ తండ్రీ కూతుళ్లుగా చేశారు. భన్సాలీ కెరీర్‌లోని బ్లాక్‌ బస్టర్స్‌లో ఒకటైన ‘హమ్‌.. దిల్‌ దే చుకే సనమ్‌' సెట్స్‌పై సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్‌ మధ్య ప్రేమ చిగురించింది.

రణబీర్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌:

రణబీర్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌:

"సావరియా" టైమ్‌లో రణబీర్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ సన్నిహితులయ్యారు. ‘గోలియోం కి రాస్‌లీలా: రామ్‌లీల' షూటింగ్‌ గ్యాప్‌లో రణవీర్‌సింగ్‌, దీపిక మధ్య ప్రేమబంధం ఏర్పడింది. కారణాలేవైనా వీరిద్దరూ ఇప్పుడు ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. అయితే ‘పద్మావతి' సెట్స్‌ వీరిద్దరినీ ఒకటి చేస్తుందా..? లేదా కొత్త ప్రేమికులను ఇండసీ్ట్రకి పరిచయం చేస్తుందా..? అని బీటౌన్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

హాలీవుడ్ మూవీ :

హాలీవుడ్ మూవీ :

బాజీరావు మస్తానీ, పీకూ సినిమాలతో దీపికపడుకొనే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది. అయితే హాలీవుడ్ మూవీ త్రీబుల్ ఎక్స్ లో ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకు నో చెప్పింది. ఇప్పుడు త్రీబుల్ ఎక్స్ మూవీ కంప్లీట్ కావడంతో మళ్లీ బీటౌన్ లో తన జోరు చూపించడానికి రెడీ అవుతుంది.

డిఫరెంట్ రోల్స్:

డిఫరెంట్ రోల్స్:

రామ్ లీల, పికూ, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో దీపికపడుకొనే డిఫరెంట్ రోల్స్ ప్లే చేసింది. ఈ మూవీస్ సక్సెస్ కావడంతో పాటు ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు తెచ్చాయి. దీంతో తాజాగా ఈ భామ మరో వైవిధ్యభరితమైన చిత్రాన్ని అంగీకరించింది. పద్మావతి టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీకి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్నాడు.

అందుకే అంగీకరించా..

అందుకే అంగీకరించా..

రామ్ లీలా, బాజీరావు మస్తానీ తరువాత పద్మావతి కోసం సంజయ్ లీలా భన్సాలీతో వర్క్ చేయడం హ్యపీగా ఉందని చెప్పుతుంది. ఈ పాత్ర తనకి ఎంతో కొత్తగా అనిపించిందనీ, అందుకే అంగీకరించానని దీపికా సంతోష పడుతుంది. పద్మావతి సినిమాకి అదృష్టంగా భావిస్తుందట. ఈ సినిమాలోని పద్మావతి పాత్ర కోసం సంజయ్ లీలా భన్సాలీ ఊహించిన పాత్రకు 100పర్సెంట్ ట్రై చేస్తానని దీపిక చెప్పుతుంది.ఈ మూవీ ఏ నేఫథ్యంలో తెరకెక్కుతుందనే విషయంలో యూనిట్ క్లారిటి ఇవ్వలేదు.

బాలీవుడ్ లో కూడా:

బాలీవుడ్ లో కూడా:

ఇక ఈ సినిమాలో చేస్తూనే మరో ఇరానియన్ సినిమాలో కూడా చేస్తోంది... పద్మావతిలో రాణి గా చేస్తూనే అదే సమయం లో బిచ్చగత్తెగా కనిపించటానికి సిద్దపడింది... ట్రిపుల్ ఎక్స్ మూవీతో ఇంటర్నేషనల్ రేంజ్ ను సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ మూవీ ట్రిపుల్ ఎక్స్.. రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ లో విన్ డీజిల్ తో కలిసి నటిస్తున్న దీపిక.. బాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తోంది. ఇలాంటి బ్యూటీని స్లమ్ ఏరియాల్లో బిచ్చమెత్తుకుంటున్న పాత్రలో చూపబోతున్నారు.

మురికి చిరిగిపోయిన బట్టలతో:

మురికి చిరిగిపోయిన బట్టలతో:

మొదటగా ఫ్యాన్స్ కు గుండె చెరువయిపోతుంది కానీ.. ఇదే జరుగుతోంది. ఫుల్లుగా డీగ్లామర్ రీల్ లో .. మురికి చిరిగిపోయిన బట్టలతో.. మాసిన తలతో.. చేతిలో పాత బట్టల మూటతో దీపికా పదుకొనే ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ మూవీ పద్మావతిలో నటిస్తున్న దీపిక ఇలా అయిపోయిందేంటా అని చాలామంది షాక్ తినేశారు కూడా.

తనలోని కొత్త యాంగిల్ :

తనలోని కొత్త యాంగిల్ :

ఇరానియన్ డైరెక్టర్ మజిద్ మజిదీ తెరకెక్కిస్తున్న మూవీలో.. దీపికా ఇదే రోల్ చేస్తోంది. తమ కలల రాణి.. గ్లామర్ క్వీన్ ఇలా అయిపోయిందేంటా అని ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఫీలయిపోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. తనలోని కొత్త యాంగిల్ ని ఈ చిత్రంతో ప్రపంచానికి పరిచయం చేయనుందిట దీపికా పదుకొనే.

English summary
The actress was spotted at a Dhobi Ghat and no brownies for guessing that she is playing a slum girl in the film. The actress is winning hearts with her shocking transformation in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu