దీపిక ‘వర్జినిటీ’పై...సెన్సార్ బోర్డ్ ‘వల్గర్’ దుమారం

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ మూవీ 'ఫైండింగ్ ఫన్నీ' మూవీలో దీపిక పదుకోన్, అర్జున్ కపూర్ మధ్య జరిగే సంభాషణలో.... దీపిక పదుకోన్ నేను 'వర్జిన్'(కన్యత్వం కలిగి ఉండటం) అని చెప్పిన డైలాగ్ విషయంలో వివాదం ఏర్పడింది. దీపిక చెప్పిన 'నేను వర్జిన్' అనే డైలాగ్ వల్గర్‌గా ఉందని, ఆ డైలాగ్ కత్తిరించేయాలంటూ ఆదేశించింది సెన్సార్ బోర్డు.

అయితే....సెన్సార్ బోర్డు ఆ డైలాగ్‌పై అభ్యంతరం తెలపడాన్ని దర్శకుడు హోమి అదజనియా తప్పు పడుతున్నారు. వర్జిన్(కన్యత్వం) అనే పదంలో అసభ్యత ఏముందో నాకు అర్థం కావడం లేదు. గతంలో చాలా సినిమాల్లో ఈ డైలాగ్ వాడారు అని హోమి అదజనియా వాదిస్తున్నారు.

Deepika Padukone's 'Virginity' Turns 'Vulgar' For Censor Board

గతంలో వచ్చిన 'దిల్ సె' చిత్రంలో, ఇటీవల వచ్చిన '2 స్టేట్స్' చిత్రంలో వర్జిన్ అనే డైలాగ్ వాడారని....వారికి లేని అభ్యంతరం తమ సినిమా విషయంలో ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని హోమి అదజనియా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దర్శకుడి వాదనతో సెన్సార్ బోర్డు ఏకీభవించడం లేదు.

'ఫైండింగ్ ఫన్నీ' సినిమాకు U/A సర్టిఫికెట్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డైలాగ్ కత్తిరించేయాల్సిందేనని, లేకుంటే A సర్టిఫికెట్ జారీ చేస్తామని సెన్సార్ బోర్డు తేల్చి చెప్పినట్లు సమాచారం. 'ఫైండింగ్ ఫన్నీ' చిత్రంలో దీపిక పదుకోన్ విధవ పాత్రలో కనిపించనుంది. రణవీర్ సింగ్ ఆమె భర్తగా అతిథి పాత్రలో నటించాడు. అర్జున్ కపూర్ హీరోగా నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X