ముద్దులు పెట్టడంలో అతనే ఘనుడు.. దీపికా పదుకొన్.. నాలుగేళ్ల క్రితమే ఎంగేజ్‌మెంట్?

By Rajababu

బాలీవుడ్ తారలు దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ ప్రేమాయణం ఎడతెగని టెలివిజన్ సీరియల్‌లా నడుస్తున్నది. శ్రీలంకలో వారి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. త్వరలోనే వారి పెళ్లి కూడా జరుగబోతున్నది అనే రూమర్లు ఇటీవల మీడియాలో విస్త్రృతంగా ప్రచారమయ్యాయి. తాజాగా బాలీవుడ్ తార నేహా దూపియా నిర్వహించే టాక్ షోకు తన సోదరి అనిషా పదుకోన్‌తో కలిసి దీపికా పదుకోన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన ఎంగేజ్‌మెంట్ వార్తలపై, తన వ్యక్తిగత అభిరుచులపై ఆమె ఇచ్చిన వివరణ ఇదే.

Recommended Video

Padmaavat Movie Review : పద్మావత్ సినిమా ఏలా ఉందంటే ?
 రణ్‌వీర్ సింగ్ ది బెస్ట్

రణ్‌వీర్ సింగ్ ది బెస్ట్

ఇటీవల కాలంలో బాలీవుడ్ తెరను హాట్‌హాట్‌గా ముద్దులతో ముంచెత్తుతున్నదెవరూ అనే ప్రశ్నకు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ అని తడుముకోకుండా చెప్పవచ్చు. అదే ప్రశ్నను దీపికాను నేహా దుపియా అడుగగా.. ముద్దుల వ్యవహారంలో రణ్‌వీర్ సింగ్ ది బెస్ట్ అని చెప్పింది.

ఎంగేజ్‌మెంట్ జరుగులేదు

ఎంగేజ్‌మెంట్ జరుగులేదు

దీపిక తన బర్త్‌డే రోజున ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలను తోసిపుచ్చింది. రణ్‌వీర్, తాను నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకోలేదు. అందులో వాస్తవం లేదు అని దీపిక పదుకోన్ వెల్లడించింది. అయితే నేహా దుపియా వెంటనే దీపికా చేతివేళ్లను చూసి ఎంగేజ్‌మెంట్ కాలేదు అని నిర్ధారించుకొన్నది.

 నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం

నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం

ఆ తర్వాత దీపికతో మీకు నిజంగా నిశ్చితార్థం జరుగలేదా? అని నేహా ప్రశ్నించగా.. పక్కనే ఉన్న దీపిక సోదరి అనీషా పదుకొన్ జోక్యం చేసుకొంటూ.. నాలుగేళ్ల క్రితమే వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది అని చలాకీగా స్పందించింది. వెంటనే దీపిక అవునవును అంటూ చెల్లెలికి వంత పాడుతూ నవ్వుల్లో మునిగిపోయారు.

దీపికా పదుకోన్ అద్భుతంగా ముద్దు

దీపికా పదుకోన్ అద్భుతంగా ముద్దు

దీపికా పదుకోన్ అద్భుతంగా ముద్దు పెడుతుంది అని గతంలో ఓ సందర్భంగా రణ్‌వీర్ సింగ్ వెల్లడించారు. రామ్‌లీలా చిత్రంలోని అంగ్ లాగా దే పాట చిత్రీకరణ సందర్భంగా దీపిక పెట్టిన ముద్దులు మరిచిపోలేను అని ఆయన చెప్పడం గమనార్హం. రామ్‌లీలా సినిమా షూటింగ్‌లో దీపికా పదుకోన్, రణ్‌వీర్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X