»   » ప్రపంచంలోనే అత్యంత సెక్సీ ఫిగర్ ‘దీపికా పదుకొనే’...!

ప్రపంచంలోనే అత్యంత సెక్సీ ఫిగర్ ‘దీపికా పదుకొనే’...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపికా పదుకునే పేరు చెబితే టీనేజ్ కుర్రకారు గుండెల్లో అలజడి ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఆ సుందరి నటించిన సినిమా వస్తే ఒకటి పదిసార్లు చూసే యువకులున్నారంటే ఆమెకున్న ఆకర్షణ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత సెక్సీయస్ట్ సుందరి కన్నడ సుందరి దీపికా పదుకొనే. బ్యాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పదుకొనే గారాల పట్టి..మోడటింగ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి, ఓంశాంతి ఓం చిత్రంతో బాక్సాఫీసును కొల్లగొట్టిన ఈమెను ప్రపంచంలోనే అత్యంత సెక్సీ సుందరిగా ఈసంవత్సరానికి ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ ఎంపిక చేసింది. రెండు నెలలకోసారి విడుదలయ్యే ఈ పత్రిక జూన్/జూలై సంచికలో 24 ఏళ్ల దీపికకు ప్రపంచంలోనే అత్యంత సెక్సీ సుందరీమణుల్లో అగ్రస్థానం ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వందమందిని ఈ జాబితాలోకి తీసుకున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ లో కత్రినా కైఫ్ ఉండటం విశేషం.

యాంజెలీనా జోలీ, బ్రిట్నీ స్పియర్స్..ఇలా ఎందరెందరో హాలీవుడ్ నటీమణులున్నప్పటికీ దీపికా పదుకొనే అంటే తాము పడిచస్తామని సర్వేలో పాల్గొన్న యువకులు ఘంటా పథంగా చెప్పారట. దీపికా పదుకొనే అందాల్ని చూసి భారతీయ యువతే గుల్లవుతుందనుకుంటే కొత్తగా ఈ జాబితాలోకి ప్రపంచంలోని యూత్ కూడా చేరుతోందన్న మాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu