రణవీర్ కోరమీసాలు గొరగనున్న దీపిక
ముంబై: బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపిక పదుకొనె, యంగ్ హీరో రణవీర్ సింగ్ జంటగా సంజయ్ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రామ్ లీలా'. ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. నవంబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా మొత్తం రణవీర్ కోర మీసాలతో కనిపించనున్నాడు. 28 ఏళ్ల రణవీర్ సినిమా షూటింగు కోసం దాదాపు సంవత్సరంగా కోర మీసాలను మెయింటేన్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ పూర్తవడంతో ఇక మీసాలను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే....'రామ్ లీలా' చిత్రంలో తన ప్రియురాలిగా నటించిన దీపికతోనే ఆ మీసాలను గొరిగించుకుంటాడట.

'ఈ మాసాలను పెంచడానికి, మెయింటేన్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ప్రతి రోజూ వాటికి నూనె రాసేవాడిని. త్వరలో దీపిక నా మీసాలను గొరుగుతుంది' అని రణవీర్ సింగ్ వెల్లడించారు. మీసాలు గొరిగే కార్యక్రమాన్ని కూడా సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటారని తెలుస్తోంది.
కాగా...గత కొంత కాలంగా దీపిక, రణవీర్ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. దీంతో వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై స్పందించడానికి అటు దీపిక గానీ, ఇటు రణవీర్ కానీ ఇష్టపడటం లేదు. పైగా ఇలాంటి వార్తలను ఖండించక పోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చినట్లు అవుతోంది.


Click it and Unblock the Notifications











