»   » హాలీవుడ్ ‘ఫాస్ట్ & ఫ్యూరియస్-7’లో దీపిక పదుకొనె

హాలీవుడ్ ‘ఫాస్ట్ & ఫ్యూరియస్-7’లో దీపిక పదుకొనె

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె బంపర్ చాన్స్ కొట్టేసింది. హాలీవుడ్ మూవీలో నటించే అవకాశం దక్కించుకుంది. హాలీవుడ్ యాక్షన్ సిరీస్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 6 పార్టులు వచ్చాయి.

త్వరలో రాబోతున్న 'ఫాస్ట్ ఫ్యూరియస్-7'లో దీపిక పదుకొనె నటించబోతోంది. ఈ చిత్రంలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రను చేయబోతోంది. ఇప్పటికే మన హీరోయిన్లు పలు హాలీవుడ్ సినిమాల్లో మెరిసినప్పటికీ....'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' లాంటి హాలీవుడ్ హిట్ సిరీస్‌లలో మాత్రం కనిపించలేదు. ఆ అవకాశం ఇప్పుడు దీపికకు దక్కింది.

భారీ చేజ్‌లు, యాక్షన్‌కు పెట్టింది పేరు 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌. ఈ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనివర్శల్‌ పిక్చర్స్‌ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటించనున్నారు. హీరోయిన్స్ మిచెల్లె రోడ్రిగ్యూఎజ్, జోర్డన్న బ్రెవ్స్టర్ లతో దీపిక జాయిన్ కానుంది.

దీపిక బాలీవుడ్ ప్రాజెక్టుల విషయానికొస్తే ఆమె నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ఇటీవల విడుదలై భారీ విజయం సాధించింది. ఆమె నటించిన 'రామ్ లీలా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. రజనీకాంత్‌కు జోడీగా దీపిక నటించిన 'కొచ్చాడయాన్' చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది.

English summary
As per the latest reports available, Deepika Padukone will be seen in the next installment of the hugely successful ‘Fast and The Furious’ franchise. She will play a significant character in the pacy thriller that also stars Hollywood tough guys Jason Statham and Dwayne Johnson and could hit the marquee next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu