వక్షోజాలపై కథనం: హక్కులేదంటూ మండి పడ్డ దీపిక

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్...ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనంపై తనదైన రీతిలో మండి పడింది. " OMG: Deepika Padukone's cleavage show" అంటూ సదరు పత్రిక ప్రచురించిన కథనంపై దీపిక తీవ్ర స్థాయిలో మండి పడింది. ‘అవును, నేను మహిళను. నాకు వక్షోజాలుంటాయి, దాని వల్ల మీకేంటి సమస్య' అంటూ కౌంటర్ ఇచ్చింది.

‘మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియనపుడు...మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు' అంటూ సదరు పత్రిక కథనంపై నిప్పులు కక్కింది. దీపిక పదుకోన్‌కు పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు వేలాది మంది అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె ట్వీట్‌ను సపోర్టు చేస్తూ, వేలాది రీట్వీట్ చేసారు.

Deepika Padukone slammed a leading daily

దీపిక వెల్ డన్... అంటూ ప్రియాక చోప్రా మద్దతు ఇస్తే, హుమా ఖురేషి, అదితి రావు హైదరి, దియా మీర్జా, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ బోస్, సూజిత్ సర్కార్, వీర్ దాస్, సంజయ్ గుప్తా, సాఖిబ్ సలీమ్, విశాల్ దల్దాని లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు. సదరు ఆంగ్లపత్రిక కథనాన్నితప్పుబట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X