తిక్కరేగి ట్విట్టర్లో.... దీపిక పడుకోన్ పబ్లిసిటీ స్టంటేనా?
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ట్విట్టర్లో తిక్కరేగి చేసిన వ్యాఖ్యల....వెనక పబ్లిసిటీ గిమ్మిక్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తాజా సినిమా ‘ఫైండింగ్ ఫ్యానీ' పబ్లిసిటీ పెరగడంలో భాగంగానే ఆమె ఇలా చేసి ఉంటుందనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలకు తమ పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ.....ఆమె అలా వ్యాఖ్యానించడం వెనక పబ్లిసిటీ స్టంట్ ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

ఇంతకీ దీపిక పదుకోన్ ఏం చేసింది?
" OMG: Deepika Padukone's cleavage show" ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంపై దీపిక తీవ్ర స్థాయిలో మండి పడింది. ‘అవును, నేను మహిళను. నాకు వక్షోజాలుంటాయి, దాని వల్ల మీకేంటి సమస్య' అంటూ కౌంటర్ ఇచ్చింది.
‘మహిళలకు గౌరవం ఇవ్వడం తెలియనపుడు...మీకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదు' అంటూ సదరు పత్రిక కథనంపై నిప్పులు కక్కింది. దీపిక పదుకోన్‌కు పలువురు బాలీవుడ్ స్టార్లతో పాటు వేలాది మంది అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె ట్వీట్‌ను సపోర్టు చేస్తూ, వేలాది రీట్వీట్ చేసారు.
దీపిక చేసిన వ్యాఖ్యలపూ.... వెల్ డన్ అంటూ ప్రియాక చోప్రా మద్దతు ఇస్తే, హుమా ఖురేషి, అదితి రావు హైదరి, దియా మీర్జా, రణవీర్ సింగ్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రాహుల్ బోస్, సూజిత్ సర్కార్, వీర్ దాస్, సంజయ్ గుప్తా, సాఖిబ్ సలీమ్, విశాల్ దల్దాని లాంటి వారు తమ మద్దతు ప్రకటించారు. సదరు ఆంగ్లపత్రిక కథనాన్నితప్పుబట్టారు.


Click it and Unblock the Notifications











