టీవీ షోలో యాంకర్‌ను కొట్టిన దీపిక
బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొనె జూమ్ టీవీలో ప్రసారం అవుతున్న ఒక షోలో టీవీ యాంకర్ ను కొట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అసలు దీపిక ఎందుకలా చేసింది అని అంతా షాకయ్యారు కూడా. అయితే అసలు విషయం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ టీవీ షోలో యాంకర్ గా ఉన్న వివన్...దీపిక సినిమా 'కార్తీక్ కాలింగ్ కార్తీక్" లో వివన్ కూడా నటించాడు. ఆ సినిమాలో దీపిక వివన్ కొట్టే సన్నివేశం ఉంది. అందుకే ఈ టీవీ షోలోనూ అతనిపై చేయి చేసుకుందట దీపిక.
ఈ విషయమై దీపిక మాట్లాడుతూ...''ఆ సినిమాలో నా తొలి సన్నివేశం వివన్ తోనే, ఆ సీన్లో అతన్ని కొట్టాల్సి ఉంటుంది. ఈ టీవీ షోలో కూడా అలాంటి సన్నివేశాన్నే డిజైన్ చేశారు. అందకే మరోసారి అతన్ని కొట్టాల్సి వచ్చింది"" అని చెప్పింది. వాస్తవానికి ఆ షోలో దీపిక వివన్ పై చేయి చేసుకోగానే అతని అభిమానులు, అనుచరులు దీపికపై కన్నెర్ర చేశారు. కానీ అసలు విషయం తెలుసుకుని కూల్ అయిపోయారు.


Click it and Unblock the Notifications











