twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దీపికా ఏంటా రేటూ..? దేశంలోనే టాప్ హీరోలతో సమానంగా...

    |

    దక్షిణ భారత చిత్రపరిశ్రమ బాలీవుడ్‌పై వేసిన తిరుగులేని స్టాంప్‌లలో దీపికా పదుకొనే ఒకరు. ఆమె అంగీకరించి సైన్ చేస్తే చాలు వందకోట్ల రాబడి తమ సినిమాకు గ్యారంటీ అంటూ వెంటబడే నిర్మాతలు కోకొల్లలు. సంవత్సరాలుగా నిర్మించుకుంటున్న కెరీర్ పీక్ స్టేజీలో ఉంటున్న దీపిక ఒక సినిమాతో తనకు కలుగుతున్న ఆర్థికపరమైన నష్టాన్ని మరొకరూపంలో తీర్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

    మూడు రెట్లు పెంచేసింది

    మూడు రెట్లు పెంచేసింది

    తన ఫేస్ వాల్యూను ఆమె ఏ స్థాయికి పెంచేసిందంటే ఇదివరకు తీసుకునే రెమ్యున రేషన్ కంటే మూడు రెట్లు అమాంతం పెంచేసింది. దీపిక ఇంత డిమాండ్‌ చేయడానికి కారణం సంజయ్‌ లీలా బన్సాలీ డైరెక్షన్‌లో చేస్తోన్న ‘పద్మావతి' అని టాక్‌. ఈ సినిమా కోసం ఏకంగా 200రోజులకి పైగా డేట్స్‌ ఇచ్చేసిందట.

    12 కోట్లు

    12 కోట్లు

    అందుకుగాను 12 కోట్లు పుచ్చుకున్నారని భోగట్టా. అయితే, కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందట. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే తదుపరి చేయనున్న సినిమాలకు కూడా 12 కోట్లు తీసుకోవాల్సిందేనని ఫిక్స్‌ అయ్యిందట. కానీ, నిర్మాతలు మాత్రం దీపికాకు అంత ఇవ్వడానికి ఫిక్స్‌ అవ్వడంలేదని సమాచారం.

    బాజీరావ్ మస్తాని' సినిమా కోసం 10 కోట్లు

    బాజీరావ్ మస్తాని' సినిమా కోసం 10 కోట్లు

    'బాజీరావ్ మస్తాని' సినిమా కోసం 10 కోట్ల పారితోషికం తీసుకున్న ఆమె, ఆ తరువాత సినిమా కోసం 12 కోట్ల పారితోషికాన్ని తీసుకుంది. ఇప్పటి వరకూ ఇండియాలో ఓ హీరోయిన్ తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ "బాజీ రావ్ మస్తానీ" కోసం దీపిక అందుకున్నదే. ఇదీ ఇప్పుడు దీపికా కి ఉన్న డిమాండ్

    హీరోల కన్నా ఇది ఎక్కువే

    హీరోల కన్నా ఇది ఎక్కువే

    బాలీవుడ్ లో కొంతమంది హీరోలు తీసుకునే పారితోషికం కన్నా ఇది ఎక్కువే. అంతెందుకు ఇదే సినిమాలో నటిస్తున్న హీరోలంకటే దీపికా పారితోషికమే ఎక్కువ కావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. బాలీవుడ్ లో హీరోలకి మించి ఒక హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం నిజంగా విశేషమే. అదే విషయాన్ని ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

    English summary
    while Deepika got paid Rs 1 crore for Ram-Leela in 2013, which was later hiked to Rs 7 crore for Bajirao Mastani in 2015, and that brings us to the current figure of Rs 12.65 crore for Padmavati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X