తెలుగు ఐటం సాంగ్ లో దీపిక
హిందీ సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తెలుగు ప్రేక్షకులకు కూడా కను విందు చేయబోతోంది. ఆమె ఒక తెలుగు సినిమాలో తన అందాలను ఆరబోయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. హిందీ, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే లవ్ ఫర్ ఎవర్ అనే సినిమాలో ఆమె ఐటం సాంగ్ చేయబోతోంది. దీపికా పదుకొనే, అందులోనూ ఐటం సాంగ్ అంటే గరం గరంగానే ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకులు ఆమె ఐటం సాంగ్ ముందు పడిపోతారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











