'దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే' రీమేక్ లో ఆమె
అప్పట్లో షారూఖ్,కాజల్ చేసిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే చిత్రం చూడని సినిమా ప్రియుడు లేడంటే అతిశయోక్తి లేదు. అలాగే ఆ సినిమా బేస్ చేసుకుని చాలా తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాని రీమేకే చేయాలని కొందరు బాలీవుడ్ పెద్దలు ఆలోచిస్తున్నారు. పనిలోపనిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా తాను ఆ సినిమాలో చేయటానికి చాలా ఆసక్తి అని ప్రకటించేసింది.ఆమె ఈ విషయాన్ని ఇటీవల ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో చెప్పుకొచ్చారు దీపిక. ఆమె మాట్లాడుతూ దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే రిలీజైనప్పుడు నాకు తొమ్మిదేళ్లు. అప్పట్నుంచి ఇప్పటికీ నన్ను హంట్ చేస్తూనే ఉంది ఆ సినిమా.
ముఖ్యంగా కాజోల్ పోషించిన సిమ్రాన్ పాత్రను లైఫ్‌లో మరచిపోలేను. మళ్లీ ఆ సినిమా తీయాలని, అందులో నేనే హీరయిన్ గా నటించాలని ఉవ్విళ్ళూరుతున్నాను అన్నారు. మరి షారుక్‌గా ఎవరిని ప్రిఫర్ చేస్తారు..? అనడిగితే షారూఖ్ నే ఆ పాత్ర చేస్తారు. ఇప్పటికీ ఆయన గ్లామర్‌లో ఏ మాత్రం ఛేంజ్ రాలేదు. అంతేకాదు... ఆయన్న తప్ప ఆ పాత్రలో మరో హీరోను ఊహించలేను. ఆ రేంజ్‌లో చిలిపితనాన్ని, అమాయకత్వాన్ని, ప్రేమభావాన్ని ఎవరూ పండించలేరని నా అభిప్రాయం. ఎలాగూ ఓం శాంతి ఓం తో మేం హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నాం. మళ్లీ అలా కలిస్తే... అది నిజంగా గాడ్ గిఫ్ట్‌గా ఫీలవుతా అంటూ ఉద్వేగంతో చెప్పుకొచ్చారు దీపిక.ప్రస్తుతం షారూఖ్ ..రావన్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











