twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్‌లో దీపికా పదుకోనె హంగామా(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : సంజయ్ లీలా భన్సాలీ తాజా చిత్రం . ఈ చిత్ర ప్రచారంలో భాగంగా చిత్రంలో హీరో రణ్‌వీర్‌సింగ్‌, హీరోయిన్ దీపికా పదుకొనే హైదరాబాద్‌లో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచి కథ దొరికితే తెలుగులో నటించేందుకు సిద్ధమని దీపికా పేర్కొన్నారు.

    అంతేకాకుండా వెంకటేష్ తన ఫేవరెట్ నటుడని ఆమె పేర్కొన్నారు. అంతేగాక...వెంకటేష్ తో తాను చేయటానికి సిద్దమని ఆమె అన్నారు. గతంలో ఆమెతో మహేష్ సినిమా ఉందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీ ఆమె పేర్కొన్నారు. తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె చెప్పుకొచ్చారు.

    ఇక తెలుగులో తనకు రానా దగ్గుబాటి క్లోజ్ ఫ్రెండ్ అనీ, తెలుగులో మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమేననీ చెప్పింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోనే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటించిన 'రామ్‌లీల' చిత్రం ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

    నన్ను ఎంచుకుంటాయి...

    నన్ను ఎంచుకుంటాయి...


    ''నాకు సినిమాల్ని ఎంచుకునేంత శక్తి లేదు. సినిమాలే నన్ను ఎంచుకుంటాయి. 'కాక్‌టెయిల్‌' తర్వాత దర్శకులు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు '' అని చెప్పింది హిందీ హీరోయిన్ దీపికా పదుకొణే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రామ్‌-లీలా'. రణ్‌వీర్‌ సింగ్‌ హీరో. ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల మందుకొస్తోంది.

    దీపికా పడుకోనే మాట్లాడుతూ....

    దీపికా పడుకోనే మాట్లాడుతూ....

    "ఈ మధ్య వరుసగా నాలుగు సినిమాలు - 'కాక్‌టైల్', 'రేస్ 2', 'యే జవానీ హై దీవానీ', 'చెన్నై ఎక్స్‌ప్రెస్' - బాగా ఆడాయి. నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం కాదు కానీ, సినిమాలే నన్ను ఎంపిక చేసుకుంటున్నాయి అని భావిస్తున్నా. ఇప్పటివరకూ నేను చేసిన వాటిలో 'రామ్‌లీల'లో చేసిందే ఎక్కువ ఛాలెంజింగ్ రోల్. శారీరకంగా, భావోద్వేగపరంగా డ్రీమింగ్ రోల్. ఈ సినిమా చేయడమనేది నాకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.''అని చెప్పారు.

    రణవీర్‌సింగ్ బెస్ట్ అండ్ వర్సటైల్ ...

    రణవీర్‌సింగ్ బెస్ట్ అండ్ వర్సటైల్ ...

    ఇప్పటివరకూ నేను చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒకటి నేర్చుకున్నా. 'రామ్‌లీల'లో హీరోగా చేసిన రణవీర్‌సింగ్ బెస్ట్ అండ్ వర్సటైల్ యాక్టర్. స్పాంటేనిటీ ఉన్న యాక్టర్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.

    'కొచ్చాడయాన్' గురించి...

    'కొచ్చాడయాన్' గురించి...

    ప్రాంతీయ భాషా చిత్రాల విషయానికొస్తే నేను చేసిన 'కొచ్చాడయాన్' ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు, హిందీతో పాటు అనేక ఇతర భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 'అవతార్', 'టిన్ టిన్' సినిమాల తరహాలో మోషన్ కేప్చర్ టెక్నాలజీతో రూపొందిన తొలి భారతీయ సినిమా. రజనీకాంత్ జోడీగా ఆ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా.

    రణవీర్‌సింగ్ మాట్లాడుతూ....

    రణవీర్‌సింగ్ మాట్లాడుతూ....

    "దీపిక నన్ను బెస్ట్ యాక్టర్ అనడం సంతోషంగా ఉంది. దీపికను గ్యారంటీగా ఇదివరకు ఎప్పుడూ చూడని అవతారంలో 'రామ్‌లీల'లో చూడబోతున్నారు. విలక్షణ నటి అంటే ఆమే. ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు చేస్తూ వస్తోంది. నేను చేసిన మునుపటి సినిమా 'లుటేరా', ఇప్పుడు 'రామ్‌లీల' రెండూ ఇన్‌టెన్స్ లవ్ స్టోరీలు కావడం వల్ల నా సహ తారలతో నా పేరు కలిపి ప్రచారంలోకి వస్తున్నాయని అనుకుంటున్నా. లింకప్స్ ప్రచారం విన్నప్పుడు చికాకుగా అనిపిస్తుంది. నా తదుపరి సినిమా 'గుండే' యాక్షన్ సినిమా కాబట్టి లింకప్ ప్రచారం ఉండదని ఆశిస్తున్నా'' అన్నారు.

    మన సినిమా భవిష్యత్తు అదే ...

    మన సినిమా భవిష్యత్తు అదే ...

    ''అవతార్‌', 'టిన్‌టిన్‌' లాంటి సినిమాలు మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో తెరకెక్కాయి. ఇప్పుడు 'కోచ్చడయాన్‌' కూడా ఇలాంటి సాంకేతికతతోనే వస్తోంది. ఈ సినిమాలో నటించడం గర్వంగా ఉంది. భారతీయ సినిమాల భవిష్యత్తు ఇదే'' అని చెప్పింది.

    ఐదు సినిమాలకు పనిచేసినట్లే...

    ఐదు సినిమాలకు పనిచేసినట్లే...

    దీపిక మాట్లాడుతూ... ''రామ్‌-లీలా'లో నా పాత్ర ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో పని చేయడం ఐదు సినిమాలకు పనిచేసిన అనుభూతినిచ్చింది.'' అని చెప్పింది.

    తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు అంటే ...

    తెలుగు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు అంటే ...

    ''తెలుగులో నటించమని నన్ను ఇంతవరకు ఎవరూ అడగలేదు. అడిగితే తప్పకుండా చేస్తాను'' అని చెప్పింది. ''మోడలింగ్‌ చేసేటప్పుడు గతంలో చాలా సార్లు హైదరాబాద్‌ వచ్చాను. ఆహారం, సంప్రదాయాలు, వాతావరణం అన్నీ నా స్వస్థలం బెంగళూరులాగే ఉంటాయి'' అని చెప్పింది దీపిక.

    పిర్యాదు...

    పిర్యాదు...

    బాలీవుడ్ చిత్రం రామ్ లీలా విడుదలను అడ్డుకోవాలని సామాజిక కార్యకర్త ఊర్వశి శర్మ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు. 'గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా' చిత్ర టైటిల్ లో 'రామ్ లీలా' పేరును తొలగించాలని శర్మ సూచించారు. రామ్ లీలా పేరును తొలగించి 'గోలియోంకి రాస్ లీలా'గా ఉంచాలని... అప్పటి వరకు చిత్ర విడుదలను ఆపివేయాలని రాష్ట్ర ప్రజల తరపున అఖిలేష్ యాదవ్ కు ఫిర్యాదు చేశాను అని అన్నారు.

    అభ్యంతరకరం...

    అభ్యంతరకరం...

    ఒకవేళ రామ్ లీలా పదాన్ని తొలగించకపోతే.. నేషనల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. 'రామ్ లీలా' పదం లక్షలాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయమని, వ్యాపార ప్రకటనల్లో చూపిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది అని అన్నారు. తాను యూట్యూబ్ లో ఈ చిత్ర ప్రోమోను చేశానని.. డైలాగ్స్, సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయి అని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా, అశ్లీలంగా ఉన్నాయని ఓ సామాజిక కార్యకర్తగా తన అభిప్రాయం అని అన్నారు.

    English summary
    Deepika Padukone Says: "I haven't been offered anything yet. As an actor, I'm very comfortable with Hindi, but if I get anything interesting in Telugu, I would definitely consider doing it. Venky is one of my favourite actors here. I would love to work with him. And yes, Rana Daggubati... he is also a very close friend of mine."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X