దీపికా పదుకొన్ ఓం శాంతి ఓం.. శ్రీవారి దర్శనం.. ఫర్హాఖాన్ కూడా ఆలయ ప్రవేశం?..

By Rajababu

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొన్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫర్హాఖాన్ ఇద్దరు బిజిబిజీగా వెళుతూ కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారో అనే విషయం అంతుపట్టని సమయంలో వారు రేణిగుంట విమానాశ్రయంలో తేలారు. అక్కడి నుంచి వారు తిరుమల దర్శనానికి వెళ్లినట్టు అందరికీ అర్థమైంది. దీపికా పదుకొన్ శ్రీవారిని దర్శించుకొన్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Recommended Video

Deepika Padukone Now A New Member Of AMPAS
 దీపికాకు పదేళ్లు

దీపికాకు పదేళ్లు

బాలీవుడ్‌లోకి దీపికా పదుకొన్ ప్రవేశించి నవంబర్ 9వ తేదీకి పదేళ్లు పూర్తయ్యాయి. ఫర్షాఖాన్ దర్శకత్వం వహించిన ఓం శాంతి ఓం చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌ సరసన దీపికా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించడం దీపికా బాలీవుడ్‌లో పాగా వేయడానికి కారణమైంది.

 శ్రీవారిని దర్శించుకొన్న దీపికా పదుకొన్

శ్రీవారిని దర్శించుకొన్న దీపికా పదుకొన్

తాను పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకొన్న సందర్భంగా తనకు సినీ జీవితం ప్రసాదించిన ఫర్షాఖాన్‌తో కలిసి దీపికా పదుకొన్ తిరుమలలోని శ్రీవారిని దర్శించున్నట్టు సమాచారం. తిరుమల దర్శనానికి వచ్చిన దీపికా సంప్రదాయబద్దంగా షికంకారీ సూట్‌లో రావడం గమనార్హం. ఫర్హాఖాన్ నీలరంగు చుడీదార్ కమీజ్‌లో కనిపించింది. వీరివెంట దర్శకుడు దినేష్ జైన్ వచ్చారు.

 వివాదంలో పద్మావతి

వివాదంలో పద్మావతి

దీపికా నటించిన తాజా చిత్రం పద్మావతి. ఈ చిత్రాన్ని అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఎలాంటి విఘ్నాలు కలుగకుండా చూడాలని భగవంతుడిని వేడుకోవడానికి తిరుమలకు వచ్చినట్టు సమాచారం.

 అలాంటి రొమాన్స్ లేదు.. భన్సాలీ

అలాంటి రొమాన్స్ లేదు.. భన్సాలీ

పద్మావతి చిత్రంలో రాణి పద్మినీగా దీపికా పదుకొన్ నటిస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను తన ప్రియుడు రణ్‌వీర్ సింగ్ పోషించాడు. అయితే వారిద్దరి మధ్య రొమాన్స్ ఉందనే రూమర్‌ అనేక నిరసనలకు కారణమైంది. అయితే పద్మావతి చిత్రంలో అలాంటి సన్నివేశాలు లేవని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వివరణ ఇచ్చాడు. అయినా ఈ చిత్రాన్ని విడుదల కాకుండా నిలిపివేయాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 డిసెంబర్ 1న పద్మావతి

డిసెంబర్ 1న పద్మావతి

షాహీద్ కపూర్, దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ నటించిన పద్మావతి చిత్రం డిసెంబర్ 1న రీలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్లు, ఫస్ట్‌లుక్, ట్రైలర్లు సోషల్ మీడియాలో ట్రెడింగ్‌గా మారాయి. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X