స్టార్ హీరోయిన్..జిమ్ లో కష్టపడుతోంది(ఫొటోలు)

By Srikanya

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినగానే కుర్రకారుకి గుండె లయి తప్పుతుంది. అందుకే ఆమె అంత బిజీగా ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ బిజీ అవటం వెనక ఆమె ఎప్పుడూ తన బాడీని షేప్ లో ఉంచుకోవటానికి నిరంతరం పడే కష్టం ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి. ఆమె జిమ్ లో కష్టపడే విధానం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీపికా మాట్లాడుతూ..."నేను ఎక్కడున్నా జిమ్ కు వెళ్లటం మానను. నేను ప్రయాణం చేసినా, అక్కడ హోటల్ లో ఉన్న జిమ్ కు వెళ్తాను. కార్డియో, వెయిట్ ట్రైనింగ్ కరెక్టు గా చేయాలి. అవి రెండూ మాత్రమే...శరీరాన్ని ఫిట్ గా ఉంచుతూ వెయిట్ లాస్ చేసి ..షేప్ అవుట్ కాకుండా చూస్తాయి " అని చెప్పుకొచ్చింది.

Deepika Padukone working out at the gym

మోడలింగ్‌ రంగం నుంచి చిత్రసీమలో అడుగుపెట్టి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకొణె. ఆమెకు మొదట్నుంచీ స్వతంత్ర భావాలెక్కువ. నిత్యం స్త్రీలపై జరుగుతున్న అత్యాచార సంఘటనలు దీపిక మనసు చలింపజేశాయి. స్త్రీల వస్త్రధారణే వాటికి కారణం అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలు దీపికాకు విస్మయం కలిగించాయి. దీనికి స్పందనగా స్త్రీ స్వేచ్ఛపై తన గళం విప్పింది దీపికా. దర్శకుడు హోమీ అదజానియా రూపొందించిన 'మై ఛాయిస్‌' వీడియోలో తన అభిప్రాయాన్ని పంచుకుంది.

''నేను ఎలా జీవించాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలన్నది పూర్తిగా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది'' అని చెప్పింది దీపికా. అంతేకాదు వివాహం గురించీ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ''నా వివాహం నాకు నచ్చినట్లే జరగడమే కాదు....నా జీవితాన్ని మగవాడితో పంచుకోవాలా లేక స్త్రీతోనా అనేదీ నా ఇష్టమే'' అంటూ కాస్త ఘాటుగానే చెప్పింది దీపికా. స్త్రీల వస్త్రధారణ, ఉద్యోగాల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని బేరీజు వేసే విధానాన్ని మగవారు మానుకోవాలని దీపికా చెప్పింది. ఈ వీడియోలో దీపికా సహా మొత్తం 99 మంది స్త్రీలు నల్లటి దుస్తులు ధరించి స్వేచ్ఛ కోసం తమ వాణిని బలంగా వినిపించారు.

Deepika Padukone working out at the gym

నా శరీరం, నా మనస్సాక్షి, నా ఇష్టం.. అంటూ తన జీవితం గురించి చెప్పుకొచ్చింది పదుకొనే. నాకు నచ్చినట్లు జీవిస్తాను. నాకు నచ్చే విధంగా దుస్తులు ధరిస్తాను. అది ఏ విధంగానైనా ఉండొచ్చు. వివాహం చేసుకునేందుకు ఇష్టపడొచ్చు.. ఇష్టపడకపోవచ్చు.. నా శరీరాన్ని ఎలా ఉంచుకోవాలో నాకు తెలుసు. ప్రేమ చివరి వరకు ఇవ్వగలను.. కొంత మందికి ఇవ్వొచ్చు.. మరి కొందరికి ఇవ్వకపోవచ్చు. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనచ్చు. అది నా ఇష్టం. అబ్బాయిని అయినా ప్రేమించొచ్చు. అమ్మాయినైనా ప్రేమించొచ్చు. దీస్ ఈజ్ మై ఛాయిస్.. మీరేవరూ నన్ను ప్రశ్నించడానికి అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ భామ దీపికా. లఘు చిత్రం పేరు మై ఛాయిస్.

2007లో ‘ఓం శాంతి ఓం' సినిమాతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సుందరి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చోటు సంపాదించింది. దీపికా తాజాగా నటించిన మూడు పికూ, తమాషా, బాజీరావు మస్తానీ సినిమాలు ఈ సంవ్సతరం విడుదలవనున్నాయి. ఇటీవల దీపికా నటించిన సినిమాలన్నీ 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన కొచ్చాడయాన్ కామిక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X