ఐఫా: నిమిషాల వ్యవధిలో కోట్లు సంపాదిస్తున్న స్టార్స్...
హైదరాబాద్: బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక ఐఫా(ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) ఈ సారి కూడా గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి స్పెయిన్ లో అవార్డుల వేడుక జరుగబోతోంది.
బాలీవుడ్ టాప్ స్టార్లు ఈ వేడుకలో ఆడి పాడనున్నారు. ఐఫా నిర్వహకులు భారీగా పారితోషికం ఇచ్చి ప్రియాంక, దీపిక, సల్మాన్, హృతిక్ లాంటి స్టార్లతో స్టేజీ పెర్ఫార్మెన్స్ కు ఏర్పాటు చేసారు. ఒక్కో స్టార్ ఒక్కో పాటకు ఐదు నిమిషాలకు మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశమేలేదు.
అయితే పెర్పార్మెన్స్ ఇచ్చేది నిమిషాల్లోనే అయినా వారి రెమ్యూనరేషన్ మాత్రం కోట్లలో ఉంటోంది. దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ల స్టేజీ పెర్ఫార్మెన్స్ ఐఫా వేడుకలో హైలెట్ కానుందని అంటున్నారు.
గతంతో పోలిస్తే ఈ సారి స్టార్స్ అంతా కూడా రెమ్యూనరేషన్ భారీ మొత్తంలో తీసుకుంటున్నారని అంటున్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఐఫా నిర్వాహకులు ఈ వేడుక నిర్వహిస్తుండటం గమనార్హం. ఐఫా పెర్ఫార్మెన్స్ కు గాను స్టార్స్ తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు స్లైడ్ షోలో...

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ఐఫా వేడుకలో 10 నిమిషాల పెర్ఫార్మెన్స్ కు రూ. 5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్.

హృతిక రోషన్
హృతిక్ రోషన్ దాదాపు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నాడట.

ప్రియాంక
ప్రియాంక చోప్రా ఒక్కో నిమిషానికి 33 లక్షల చొప్పున 4 నిమిషాల ప్రదర్శనకు రూ. 1.3 కోట్లు తీసుకుంటుందట.

దీపిక
దీపిక పదుకోన్ కూడా ప్రియాంక చోప్రాకు సమానంగా రెమ్యూనరేషన్ 1.3 కోట్ల వరకు తీసుకుంటోందట


Click it and Unblock the Notifications











