»   » దీపిక పదుకోన్ నిర్ణయంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు!

దీపిక పదుకోన్ నిర్ణయంతో నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ జనవరి 5వ తేదీతో 30వ వసంతంలోకి అడుగు పెట్టింది. తన పుట్టినరోజు సందర్భంగా దీపిక పదుకోన్ షాకింగ్ నిర్ణయం తీసుకుందంట. తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది. బాలీవుడ్లో తన ఉన్న డిమాండును దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ విషయంలో కొండెక్కి కూర్చుంది.

ఇకపై ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకుందట. దీపిక నిర్ణయం విని పలువురు బాలీవుడ్ నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. నిన్నటి వరకు దీపిక ఒక్కో సినిమాకు 8 నుండి 9 కోట్లు తీసుకునక్నట్లు టాక్. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా దీపిక పదుకోన్ దరిదాపుల్లో కూడా లేరు.

Deepika's Remuneration Hike

2016లో దీపిక పదుకోన్ హాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇది కూడా దీపిక పదుకోన్ రెమ్యూనరేషన్ పెంచడానికి కారణం అయి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా హాలీవుడ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇప్పటికే అమెరికాలో ఓ టీవీ సీరియల్ లో నటిస్తోంది. పాప్ ఆల్బమ్స్ చేసింది. త్వరలో ఆమె హాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ కూడా తన స్పీడు పెంచింది. ఇప్పటికే బాలీవుడ్లో కావాల్సినంత ఫేమ్ సంపాదించిన ఆమె హాలీవుడ్లో తన సత్తా చాటాలని నిర్ణయించుకుంది. మరి 2016 సంవత్సరం అమ్మడుకి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి!

English summary
Deepika Padukone will charge for her amazing efforts to put into a film is 15 crore. While this number can make one go jaw-dropping, the buzz is that other Bollywood actresses are not even close to what Dippy earns.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu