రజనీ 'విక్రమసింహ' పాటల వేడుక-2 (ఫోటోలలో)

By Srikanya

చెన్నై:సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'కోచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') సినిమా విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది.

రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వంలో నటనా సంగ్రహణ యథార్థ చిత్ర సాంకేతికతతో భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారిగా రూపొందించిన త్రీడీ చిత్రం 'విక్రమ సింహా'. ఈ చిత్రం తెలుగు, తమిళ పాటలను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు.

ఆస్కార్ సాధించిన తొలి భారతీయుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న 'విక్రమసింహా' పాటలను బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్, తమిళ దర్శక దిగ్గజం కె.బాలచందర్, ప్రముఖ దర్శకుడు శంకర్, బాలీవుడ్ సుందరి దీపికాపడుకోనె సమక్షంలో రజనీకాంత్ విడుదల చేశారు.

చెన్నైలోని సత్యం థియేటర్ ప్రాంగణంలో అభిమానుల కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, ఎస్పీ ముత్తురామన్, నటులు శరత్‌కుమార్, జాకీష్రాఫ్, ఆది, నిర్మాతలు డా. మురళి మనోహర్, నందు అహూజా, తమిళ గేయ రచయిత వైరముత్తు, తెలుగు గేయరచయితలు చంద్రబోస్, వనమాలి, అనంతశ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

మిగతా విశేషాలు... స్లైడ్ షోలో

ఆది స్పెషల్...

ఆది స్పెషల్...

గుండెల్లో గోదారి చిత్రంలో అలరించిన ఆది పినిశెట్టి ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను చేస్తున్నారు. ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

శ్రీధర్ సుబ్రమణ్యం

శ్రీధర్ సుబ్రమణ్యం

సోనీ మ్యూజిక్ ఇండియా అథినేత శ్రీధర్ సుబ్రమణ్యం ఈ పంక్షన్ కి హాజరయ్యారు. ఆయన ఇలా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తో కలిసి ఫోజిచ్చారు.

దర్శకురాలు సౌదర్య మాట్లాడుతూ...

దర్శకురాలు సౌదర్య మాట్లాడుతూ...

''ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ సినిమాను రూపొందిస్తున్నాను. నాన్న సినిమా అద్భుతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకున్నా. 'విక్రమసింహ' కార్టూన్‌ చిత్రం కాదు. యానిమేషన్‌ చిత్రం. ప్రతి సన్నివేశాన్ని 360 డిగ్రీల్లో.. పదుల కొద్దీ కెమెరాలతో చిత్రీకరించాం. నాన్న చాలా ఓపికగా నటించారు. నాన్న రుద్రతాండవం చేస్తే చూడాలన్నది నా కల. ఎట్టకేలకు.. అది ఈ సినిమాతో తీరింది. రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించాం'' అన్నారు .

రహమాన్ తో కలిసి

రహమాన్ తో కలిసి

వీళ్లిద్దరూ కాంబినేషన్ లో గతంలో శివాజి,రోబో చిత్రాలు వచ్చి పెద్ద హిట్టయ్యాయి. ఇలా వీళ్లద్దరూ మాట్లాడుతూ కెమెరాకు చిక్కారు.

లాంచ్...

లాంచ్...

తొలి సీడీని రజనీకాంత్‌ ఆవిష్కరించారు. సెలబ్రేటీలంతా ఒకే స్టేజీపై ఇలా కలిసి లాంచ్ చేసారు..

రిలీజైంది...

రిలీజైంది...

కొచ్చాడియన్ ఆడియో ఇలా రజనీ సన్నిహితులు, నటులుతో కలిసి రిలీజ్ చేసారు.

అంతా కలిసి ఫోజ్..

అంతా కలిసి ఫోజ్..

ఈ పంక్షన్ కి హాజరైన వారంతా కలిసి ఇలా స్టేజిపై కనపడి కెమెరాకు ఫోజిచ్చారు.

రజనీకాంత్‌ మాట్లాడుతూ...

రజనీకాంత్‌ మాట్లాడుతూ...

''ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడాన్ని గుర్తుకు తెచ్చుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. సోదరుల నేపథ్యంలోని 'రాణా సేన' అనే కథను ఓ సారి కె.ఎస్‌.రవికుమార్‌ నాకు వినిపించారు. 'సార్‌.. నేను సౌందర్య రూపొందించిన 'సుల్తాన్‌..' చూశాను. చాలా బాగుంది. ఆమె దర్శకత్వంలో క్యాప్చర్‌ మోషన్‌ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని చేద్దా'మని కేఎస్‌ రవికుమార్‌ అడిగారు. సౌందర్యని అడిగితే చేస్తానంది. అలా 'కోచ్చడయాన్‌' పేరుతో ఆ చిత్రాన్ని ప్రారంభించే ప్రయత్నాలు చేశాం. నాకు ఆ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం లేదు. దీంతో పలు ఆంగ్ల చిత్రాలు చూశా. నా మిత్రులను అడిగితే.. అలాంటి చిత్రాలకు బడ్జెట్‌ రూ.700 కోట్ల వరకు అవుతుందన్నారు. ఐదేళ్ల సమయం పడుతుందని చెప్పారు. చాలా భయమేసింది.

రజనీకంటిన్యూ చేస్తూ...

రజనీకంటిన్యూ చేస్తూ...

'చాలా రిస్క్‌ తీసుకుంటున్నావేమో' అని సౌందర్యతో చెప్పా. 'లేదు నాన్నా.. ఏడాదిన్నరలో చేసేస్తా. నాకు ఆ నమ్మకం ఉంద'ని చెప్పింది. నిజంగానే నాకు ఆశ్చర్యమేస్తోంది. ఇప్పుడు ఇలా వేదికపై సౌందర్య మాట్లాడుతుంటే.. మా అమ్మాయేనా? అని ఆశ్చర్యపోయాను. దేశంలోనే ఎవరూ చేయని సాహసం మా అమ్మాయి చేస్తోంది. హ్యాట్సాఫ్‌!.. నా కుమార్తెలు ఇద్దరూ దర్శకత్వం చేస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తున్న నా అల్లుళ్లకు కృతజ్ఞతలు. స్త్రీలు కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించాలన్నది నా విన్నపం. పిల్లల పెంపకంలో వారి పాత్ర అమూల్యమైంది. దీన్ని నా కూతుళ్లు మనసులో పెట్టుకుంటారనుకుంటున్నాను. సౌందర్య చాలా సినిమాలకు దర్శకత్వం వహించి ఉన్నత స్థితికి వెళ్లాలి. ఈ చిత్రంలోని సాంకేతికతను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మిగిలిన విషయాలను విజయోత్సవసభలో పంచుకుంటాను'' అన్నారు.

 షారుఖ్‌ఖాన్‌ మాట్లాడుతూ.....

షారుఖ్‌ఖాన్‌ మాట్లాడుతూ.....

''ఈ వేదికపై నిల్చుంటే నాకు 24ఏళ్ల క్రితం విషయాలు గుర్తుకొస్తున్నాయి. నేను అప్పుడు బాంబేకి వెళ్లా. అక్కడ ఓ హిందీ సినిమా చిత్రీకరణ జరుగుతోంది.. రజనీ సార్‌ అందులో హీరో. ఆయనకి స్త్టెల్‌గా నోట్లో సిగరెట్‌ వేసుకోవడం తెలిసినా.. స్పాట్‌లో చాలా సార్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఆయన్ని అలా చూసి ఇక ఆయనే నాకు స్ఫూర్తి అని నిర్ణయించుకున్నాను. నేను రజనీకాంత్‌కు పెద్ద అభిమానిని.. ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పాను. ఇటీవల 'చెన్నైఎక్స్‌ప్రెస్‌'లోనూ రజనీసార్‌ గురించి చెప్పాను. పాట కూడా పెట్టాం'' అన్నారు.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ...

ప్రముఖ దర్శకుడు శంకర్‌ మాట్లాడుతూ...

'''రోబో'లో వేలాది మంది చిట్టీ రోబోలు కనిపించే సన్నివేశాలు మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో చేసినవే. కానీ ఆ సన్నివేశంలో చిట్టీ పాత్ర తప్ప మిగిలినవన్నీ నిజ రూపాలే. ఇందులో ప్రతి పాత్ర యానిమేటెడ్‌ విధానంలోనే చేశారు. అది ఎంత కష్టమో నేను ఊహించగలను. అందుకు తగ్గ ఫలితం దక్కుతుందని నమ్ముతున్నా'' అన్నారు.

 దీపికా పదుకొణే మాట్లాడుతూ..

దీపికా పదుకొణే మాట్లాడుతూ..

దేశంలోనే తొలిసారిగా చేస్తున్న ప్రయోగాత్మక చిత్రంలో నేనూ భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X