యువరాజ్ తో దీపికా పడుకొనే పెళ్లి

యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే సిడ్నీ చేరుకున్న దీపికా తన 22వ జన్మదినోత్సవాన్ని యువరాజ్ సమక్షంలో జరుపుకుంది. తాజా సమాచారం ఏమంటే యువరాజ్ సింగ్, దీపికా పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. చక్కగా కలిసిపోతున్న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. లేట్ నైట్ రెస్టారెంట్లలో గడపడం మూలంగానే దాని ప్రభావం యువరాజ్ సింగ్ పై పడినట్టు విమర్శలు కూడా వచ్చాయి. ఆయన స్కోర్లు 12,0 గా నమోదవడం కూడా ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి.
ఇంకో విషయం ఏమంటే యువరాజ్ సింగ్ కు సినీ తారలతో తిరగడం కొత్తేం కాదు. ఇన్నాళ్లు కిమ్ శర్మతో తిరిగిన యువరాజ్ ఇపుడు దీపిక ప్రేమలో పడ్డాడు. దీపికా పడుకొనే కూడా తక్కవేం తినలేదు..ఆమె కూడా రనబీర్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగింది. అంతకుముందు కూడా దీపిక సినిమా పరిశ్రమకు చెందని వ్యక్తితో కూడా ప్రేమాయణం నడిపింది. అనుభవం విషయంలో ఇద్దరూ ముదుర్లే.


Click it and Unblock the Notifications











