దీపిక పదుకొనెపై కోడిగుడ్లు, టమోటాలతో దాడికి యత్నం!
అహ్మదాబాద్: తన తాజా సినిమా 'రామ్ లీలా' ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనెకు అహ్మదాబాద్‌లో జరిగిన గార్బా ఈవెంటులో పాల్గొనడానికి వెళ్లి... ఊహించని సంఘటన ఎదుర్కొంది. గుజరాతీ అభిమానులను నుంచి తనకు సాదర స్వాగతం అభిస్తుందని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై కోడిగుడ్లు, టమోటాలతో కొందరు దాడికి ప్రయత్నించారు.
ఓ ప్రముఖ ఆంగ్లపత్రిక కథనం ప్రకారం....కొంత మంది ఆందోళనకారులు అహ్మదాబాద్‌లో జరిగిన గార్భా ఈవెంటు వద్దకు వచ్చి ఆమెపై దాడికి ప్రయత్నించారు. దీపిక నటించిన 'రామ్ లీలా' చిత్రంలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో వాటిని తొలగించాలని ఆందోళన కారులు డిమాండ్ చేసారు.
దాడికి పాల్పడిన వారు....జడేజా, రాంబారీ కమ్యూనిటీకి చెందిన వారుగా భావిస్తున్నారు. 'రామ్ లీలా' చిత్రంలో వారి మనోభావాలు దెబ్బతినే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, అందుకే వారు ఆగ్రహంతో దీపిక పాల్గొన్న గార్భా ఈవెంటుకు వచ్చి తమ ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో సినిమాలోని అభ్యంతరకన సీన్లు తొలగించేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం.
దీపిక పదుకొనె, రణవీర్ సింగ్ హీరో హీరోయిన్లుగా సంజయ్ లీలా భన్సాలీ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'రామ్ లీలా' చిత్రం తెరకెక్కింది. ఇదొక ప్రేమకథా చిత్రం. సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ దర్శకుడి చిత్రం కావడంతో సినిమాపై అంచనాలున్నాయి.
పవన్ శర్మ అనే న్యాయవాది అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో 'రామ్ లీలా' సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసారు. 'నవంబర్ 15న విడుదలకు సిద్దంగా ఉన్న ఈచిత్రం యొక్క ఇటీవల విడుదలైన ప్రోమోలోని సన్నివేశాలు వివిధ వర్గాల మధ్య శతృత్వం పెంచే విధంగా ఉన్నాయని' పవన్ శర్మ ఆరోపించారు.


Click it and Unblock the Notifications












