అయ్యో ఆ మాయలేడి పవన్ నీ మోసం చేసిందా?
కొద్ది రోజుల క్రితందీప్తి రెడ్డి అనే యువతి మగవారిని , ముఖ్యంగా ఎన్.ఆర్.ఐలను మోసం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ లో పరిచయమై అబద్దాలు చెప్పి వారినుంచి డబ్బు గుంజుతూ, వారిలో కొందరిని పెళ్లాడి మోసాలకు పాల్పడడం ఈ యువతి వృత్తిగా పెట్టుకుంది.ఆమె విజయ్ అనే వ్యక్తి ద్వారా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు పరిచయం అయ్యిందని ఇప్పుడు బయిటకు వచ్చింది. దీప్తి రెడ్డి మెగాస్టార్ చిరంజీవి, అలాగే ఆయన సోదరుడు పవన కళ్యాణ్ లతో కలసి వాహనంపై ఉన్న ఫోటోలను ఒక పత్రిక ప్రచురించింది.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రచారానికి వెళ్లినప్పుడు ఆమె కూడా క్రియాశీలకంగా ఆయనతో తిరిగిందన్న సమాచారం సంచలనం కలిగిస్తుంది. అంతేగాదు ఆమె కూడా ఆ పార్టీకి ప్రచారం చేశారు.ఆమె ఎంత పలుకుబడి తెచ్చుకుందంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల తో కలసి ఒకే వాహనంలో ప్రయాణం చేయగలిగింది. తమతో పాటు తిరిగే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకోకుండా వారిని తమతో తిప్పుకున్నారని అందరూ షాక్ అవుతున్నారు.
ఐదుగురిని వివాహమాడి, వారి నుంచి డబ్బు సంపాదించి మోసగించిన మాయలాడి చివరికి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను కూడా ఎలా బుట్టలో వేసుకుందో అంటున్నారు. అంతేగాక వారిని కూడా ఏమన్నా మోసం చేసిందా అని డౌట్ పడుతున్నారు. అంతేగాక పవన్ కళ్యాణ్ మంచితనాన్ని ఆసరా చేసుకుని ఆమె ఆల్రెడీ మోసం చేసి ఉడాయించిందని కూడా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











