బూతు కాదు బ్యూటిఫుల్, దిల్ రాజు సినిమాలైనా అంతే, నా టార్గెట్ యూతే: దర్శకుడి సంచలనం

'1940లో ఒక గ్రామం' లాంటి జాతీయ అవార్డ్ దక్కించుకున్న సినిమా తీసిన నరసింహ నంది దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'డిగ్రీ కాలేజ్'. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ వివాదాస్పదం అయింది. బూతు సన్నివేశాలు, అశ్లీలం ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన నటి జీవిత కూడా అది చూసి షాక్ అవ్వడంతో పాటు... సభా ముఖంగా ఇలాంటి బూతు సినిమాలు తీస్తున్నారేంటి అంటూ దర్శక నిర్మాతలకు క్లాస్ పీకింది. ఈ పరిణామాలపై దర్శకుడు నరసింహ నంది ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. తనది బూతు సినిమా కాదని, యూత్ మెచ్చే సినిమా అని సమర్దించుకున్నారు.

యువతకు ఏదైతే కావాలో అదే ఉంది

యువతకు ఏదైతే కావాలో అదే ఉంది

‘‘డిగ్రీ కాలేజీ' టీజర్ సంచలనం అవుతుందని ఊహించలేదు. నాకు కనెక్ట్ అయిన కథను చేద్దామని చేశాను. టీజర్లో కొన్ని రొమాంటిక్ షాట్స్ ఉన్నాయి. వాటికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అవ్వడం వల్లనే అది సెన్సేషన్ అయింది. 24 గంటల్లో 2 మిలియన్ యూట్యూబ్ వ్యూస్ వచ్చాయి. యువతకు ఏదైతే కావాలో అది అందులో ఉంది. అదే మేము సినిమాలో చూపించబోతున్నాం'' అని నరసింహ నంది తెలిపారు.

చాలా డెప్త్ ఉన్న కథ

చాలా డెప్త్ ఉన్న కథ

‘‘డిగ్రీ కాలేజ్ టీజర్ లాచింగ్ ఈవెంటుకు వచ్చిన జీవితగారు కాస్త అభ్యంతరం వ్యక్తం చేసిన మాట నిజమే. కానీ కేవలం లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్ల వల్ల సినిమా ఆడదు. ఆ ఉద్దేశ్యంతో మేము చేయలేదు. కథలో అదొక భాగం. సినిమా కథ ఏమిటనేది త్వరలో విడుదల చేసే ట్రైలర్లో చెబుతాం. చాలా డెప్త్ ఉన్న కథ. ఎవరూ కథను ఊహించరు. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు.'' అన్నారు.

దిల్ రాజు సినిమాలకు కూడా అలాంటి వారు రారు

దిల్ రాజు సినిమాలకు కూడా అలాంటి వారు రారు

‘‘జీవితగారైనా, మరెవరైనా మా సినిమాపై పాజిటివ్‌గా మాట్లాడినా, నెగెటివ్‌గా మాట్లాడినా పట్టించుకోను. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు చూసేది యూతే. దిల్ రాజు సినిమాలకైనా కూడా ఫస్ట్ వీకెంట్ వచ్చేది కేవలం యువతే. 40 ఏళ్లపైన వయసున్న వారు థియేటర్లకు రావడం చాలా తగ్గిపోయింది. అందుకే నేను యువతకు ఏం కావాలో అదే చూపిస్తున్నాను.'' అంటూ నరసింహ నంది తన సినిమాను సమర్దించుకున్నారు.

ఆ సినిమాలో ఇంతకు మించిన రొమాన్స్ చూపించా

ఆ సినిమాలో ఇంతకు మించిన రొమాన్స్ చూపించా

నేను తీసే సినిమాలు మెసేజ్ ఓరియెంట్ సినిమాలే. అర్థవంతమైన సినిమాలే. 8 ఏళ్ల క్రితమే నేను ఇలాంటి రొమాంటిక్ షాట్లతో మంచి సందేశాత్మక సినిమా చేశాను. ‘1940లో ఒక గ్రామం' చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లును చాలా డెప్తుగా చూపించాను. అందులో షాట్లు చూస్తే షాకవుతారు. అప్పుడు ఆ సినిమా చూసే వారు కూడా బోల్డ్ గా ఆలోచించారు. వాటితో పోలిస్తే ‘డిగ్రీ కాలేజ్' లో రొమాంటిక్ సీన్ల ఘాటు తక్కువే. మనం ఇక్కడ భూతద్దంలో పెట్టి చూస్తున్నాం కానీ నార్త్ ఇండియాలో ఇవన్నీ కామన్.

బూతు కాదు.. బ్యూటిఫుల్, ఫ్యామిలీ ప్రేక్షకులను రమ్మని చెప్పడం లేదు

బూతు కాదు.. బ్యూటిఫుల్, ఫ్యామిలీ ప్రేక్షకులను రమ్మని చెప్పడం లేదు

డిగ్రీ కాలేజ్ టీజర్ చూసి అందరూ అశ్లీలం, వల్గారిటీ అంటున్నారు కానీ... సినిమా చూస్తుంటే అందంగా ఉంటుంది. తిట్లు కూడా బ్యూటిఫుల్‌గా అనిపిస్తాయి. సినిమా యూత్ కోసమే తీశాను. ఫ్యామిలీ ప్రేక్షకులను రమ్మని చెప్పడం లేదు. ఈ సినిమాకు లవర్స్, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి వస్తారనే ఉద్దేశ్యంతోనే తీశాను.

మంచి సినిమాలు తీస్తే ఎవరూ చూడరు

మంచి సినిమాలు తీస్తే ఎవరూ చూడరు

‘‘ఫ్యామిలీ ప్రేక్షకులు వస్తానంటే నేనొక మంచి సినిమా తీస్తానే... రమ్మనండి, అలాంటి సినిమాకు థియేటర్లు ఇవ్వమండి... ఎవరూ రారు.. ఎవరూ థియేటర్లు ఇవ్వరు. మంచి చెబుతానంటే ఎవరూ వినరు. అలా అని చెడు చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ఇప్పుడంతా వ్యాపారం. సినిమా అంటే కళాత్మకమైన వ్యాపారం.. కానీ ఇపుడు కళాత్మకం పోయింది. వ్యాపారం మాత్రమే మిగిలింది. నేను కళాత్మకమైన సినిమాలు తీశాను. కానీ దాన్ని ఆదరణ దక్కలేదు. డబ్బు పోయింది. మడి కట్టుకుని కూర్చుంటే నేను సినిమాలు తీయలేను.'' అని నరసింహ నంది స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X