twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్ రేప్ ఆందోళనలో మృతి: అమితాబ్ సాయం

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఢిల్లీ ఆందోళనల్లో మరణించిన సుభాష్ తోమర్ కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇటీవల ఢిల్లీలో 23ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన నేపథ్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఆందోనళ కార్యక్రమాలు చెలరేగాయి.

    వేలాది మంది విద్యార్థులు, ఆందోళన కారులు పార్లెముంటు, రాష్టపతిభవన్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాయపడ్డ పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ తోమర్ చికిత్స పొందుతూ నిన్న మరణించారు.

    ఈ ఘటనపై మనస్తాపం చెందిన అమితాబ్ బచ్చన్ పోలీస్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ విషయాన్ని అమితాబ్ తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా మీడియాకు తెలియజేసారు. ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని గ్యాంగ్ రేప్ ఘటనను అమితాబ్ ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. అదే సమయంలో మానవతా దృక్ఫథంతో ఆందోళన కారణంగా మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం అందించారు.

    ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిరసన ఆదివారంనాడు హింసాత్మకంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను గాయపరిచినవారికి సంబంధించిన వీడియో క్లిప్ తమ వద్ద ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనను హత్యా కేసు కింద పరిగణిస్తారు.

    English summary
    Bollywood megastar Amitabh Bachchan once again won the hearts of many with his latest move of donating Rs 2.5 lakh to family members of late Delhi police constable Subhash Chand Tomar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X