ఢీల్లీ క్యాబ్ రేప్: హీరో అక్షయ్ కుమార్ ట్వీట్
ముంబై: ఇటీవల ఢిల్లీలో క్యాబ్ రేప్ ఘటనపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ రేప్ సంఘటన కేవలం ఢిల్లీ సిటీకి మాత్రమే కాదు...మొత్తం దేశానికే సిగ్గు చేటన్నారు. క్యాబ్ బుక్ చేసుకునే ముందు సేఫ్టీ గురించి ముందుగా ఆలోచించాలని అక్షయ్ కుమార్ ట్వీట్ చేసారు.
2012లో ఢిల్లీలో బస్సులో జరిగిన గ్యాంగ్ రేప్ తర్వాత....ఈ క్యాబ్ రేప్ సంచలనం సృష్టించింది. ఉబర్ క్యాబర్ సర్వీస్‌కు చెందిన క్యాబులో ఈ దారుణం జరిగింది. రాత్రి డిన్నర్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న 27 మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం జరిపాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.
డ్రైవర్‌ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు చెందిన శివ కుమార్ యాదవ్ (32)గా గుర్తించారు. కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపేసి విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. బాధిత మహిళ కారు నెంబర్ ప్లేట్ ఫోటో తీసింది. ఆ తర్వాత సంఘటనపై సమాచారం ఇవ్వడానికి పిసిఆర్ కాల్ చేసింది. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











