»   » సినిమా చూడటమంటూ ముఖ్యమంత్రి ట్వీట్

సినిమా చూడటమంటూ ముఖ్యమంత్రి ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: అజయ్ దేవగన్, శ్రేయ కాంబినేషన్ లో రూపొందిన "దృశ్యం" చిత్రాన్ని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ తాజాగా చూసారు. ఆయన ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడాల్సిన చిత్రంగా చెప్పారు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు. ఆయనేం అన్నారో ఈ ట్వీట్ చూడండి

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆ చిత్రాన్ని ఆయన సోమవారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. 'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు.

ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే.

నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు.

Delhi CM Arvind Kejriwal promotes Drishyam movie

'దృశ్యం' సినిమాకు వస్తున్న స్పందన పట్ల హీరో అజయ్ దేవగణ్ హర్షం వ్యక్తం చేశాడు. ఇది అరుదైన చిత్రమని పేర్కొన్నాడు. 'దృశ్యం సినిమాకు వస్తున్న స్పందన పట్ల సంతృప్తిగా ఉన్నా. మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ అరుదైన సినిమాను నటుడిగా గౌరవిస్తా' అజయ్ దేవగణ్ ట్వీట్ చేశాడు.

అన్ని భాషల్లోనూ విజయవంతం అయిన 'దృశ్యం' హిందీలోనూ విజయవంతంగా నడుస్తోంది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం రూ. 30.33 కోట్లు వారాంతపు వసూళ్లు సాధించింది. శ్రియా శరణ్, టబు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ సాలగోంకర్ దర్శకత్వం వహించారు. వియకొమ్ 18, కుమార్ మాగ్నత్ నిర్మించారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal has recommended ajay devgan starrer "Drishyam" as a must watch.
Please Wait while comments are loading...