స్మోకింగ్ నిర్మాతలకు శుభవార్త

యూనియన్ మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్పేర్ వారు మే 2005లో ఈ ప్రపోజల్ తో బ్యాన్ పెట్టారు.దీనిని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ఛాలెంజ్ చేస్తూ సెప్టెంబర్ 2005 లో కోర్టుకి వెళ్ళారు. ఇక బహిరంగంగా పొగ తాగడంపై కేంద్రం విధించిన నిషేధంపై హైకోర్టు స్పందించ లేదు. పిల్‌లో పిటిషనర్ కోరినట్లు సినిమాల్లో ధూమపాన దృశ్యాల తొలగింపుపై మాత్రమే తుది తీర్పు వెలువరించింది. ఇది చాలా మంది సినీ దర్శక,నిర్మాతలను సంతోషపరిచే అంశం. ఇలా వరసగా నిషేధాలు పెట్టుకుంటూ పోతే నిజ జీవితాన్ని తెరపై ప్రతిబింబించలేమంటూ అభిప్రాయపడ్డ దర్శక, నిర్మాతలంతా ఆనందపడుతున్నారు.


Click it and Unblock the Notifications











