twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    3700 కోట్ల కుంభకోణం.. సన్నీ లియోన్ అరెస్ట్ తప్పదా!

    By Rajababu
    |

    నిరంతరం వివాదాల్లో మునిగి తేలే సెక్స్ బాంబ్ సన్నీలియోన్ మెడకు మరో వివాదం చుట్టుకొన్నది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోంజి స్కామ్‌లో స‌న్నీ లియోన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశముంది. గతేడాది నవంబర్ 29న అనుభవ్ మిట్టల్ అనే వ్యాపారవేత్త ఇన్‌మార్ట్‌.కామ్ అనే పోర్టల్ ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు తలెత్తుతున్నాయి.

     3700 కోట్ల కుంభకోణం.. సన్నీ పాత్ర?

    3700 కోట్ల కుంభకోణం.. సన్నీ పాత్ర?

    ఢిల్లీలోని క్రౌన్ ప్లాజా హోట‌ల్‌లో జరిగిన ఇన్‌మార్ట్‌.కామ్ ప్రారంభోత్సవంలో సన్నీలియోన్ హుషారుగా పాల్గొన్నది. అయితే ఆ పోర్టల్ ద్వారా 6.5 లక్ష‌ల మంది పెట్టుబ‌డిదారుల నుంచి అక్ర‌మంగా రూ.3700 కోట్ల మొత్తం సేక‌రించిన‌ట్లు అభిన‌వ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధమున్న ప్రతీ ఒక్కరిపై పోలీసులు నజర్ పెట్టారు. ఈ క్రమంలోనే సన్నిలీయోన్ కూడా ప్రశ్నించే అవకాశముంది.

     ఈ స్కామ్‌లో సన్నీలియోన్ ను ప్రశ్నిస్తాం..

    ఈ స్కామ్‌లో సన్నీలియోన్ ను ప్రశ్నిస్తాం..


    1978 ప్రైజ్ చిట్స్ అండ్ మ‌నీ స‌ర్క్యులేష‌న్ స్కీమ్ చ‌ట్టం కింద ఇలాంటి స్కీమ్‌ల‌ను ప్రోత్స‌హించ‌డం నేరమని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే ఆ హోట‌ల్ సిబ్బందిని కూడా పోలీసులు విచారించారు. ఆ కార్యక్రమంలో సన్నీలియోన్ పాల్గొన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ కు విచార‌ణ‌లో భాగంగా ఆమెను ప్ర‌శ్నించే అవ‌కాశం ఉందని స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ రాజ్‌కుమార్ మిశ్రా వెల్ల‌డించారు.

     ఏమిటా కుంభకోణం.. సన్నీకి సంబంధముందా

    ఏమిటా కుంభకోణం.. సన్నీకి సంబంధముందా


    ఇంట‌ర్నెట్‌లో కొన్ని వెబ్‌సైట్ల ప్ర‌మోష‌న్ కోసం సంస్థ పంపే కొన్ని లింకుల‌కు లైకులు కొట్టేలా చేయడం ఇన్‌మార్ట్‌.కామ్ బిజినెస్. ఈ పోర్టల్ చేరిన సభ్యుల నుంచి సభ్యత్వ రుసుము కింద రూ.5750 నుంచి రూ.57500 వ‌ర‌కు కూడా వ‌సూలు చేశారు. వేల కోట్ల‌ మేర డబ్బులు వసూలు చేశారనే సమాచారంతో సంస్థ‌పై ల‌క్నో ఈడీ అధికారలు మ‌నీలాండ‌రింగ్ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

    ఫొటోలలో అమీషా పటేల్!

    ఫొటోలలో అమీషా పటేల్!

    అభినవ్ మిట్టల్, సన్నీ, అమీషా పటేల్ కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం విచారణ జరిపింది. అయితే ఆ ఫొటోలు ఓ బర్త్ డే కార్యక్రమానికి సంబంధమున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ స్కామ్‌కు ఆ పార్టీకి సంబంధం లేదనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    Ponzi scam kingpin Anubhav Mittal had organised a party in Greater Noida and invited Sunny Leone for the launch of a website. We have got evidence and photos of the actor Sunny Leone in the promotional event. She may be questioned if required during the investigation," he said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X